logo

మళ్లీ భగ్గుమన్న భానుడు

జిల్లాలో మళ్లీ ఎండ జోరందుకుంది. నిప్పుల కొలిమిలా పరిస్థితి మారుతోంది.

Updated : 07 May 2024 06:22 IST

నాలుగు ప్రాంతాల్లో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత

కామారెడ్డి వ్యవసాయం, న్యూస్‌టుడే: జిల్లాలో మళ్లీ ఎండ జోరందుకుంది. నిప్పుల కొలిమిలా పరిస్థితి మారుతోంది. తెల్లవారుతుండగానే భానుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో సోమవారం ఉష్ణోగ్రత 45 డిగ్రీలపైనే నమోదైంది. ఎండలు పెరుగుతున్న స్థాయిలోనే వడగాలులు సైతం దడ పుట్టిస్తున్నాయి. ఎల్పుగొండలో అత్యధికంగా పగటి పూట 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా అత్యల్పంగా కలెక్టరేట్‌ ప్రాంతంలో 41.2 డిగ్రీల ఎండ కాచింది. జిల్లా అంతటా 41.8 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని