logo

మానసిక రోగులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలి

మానసిక రోగులకు చికిత్స, కౌన్సెలింగ్‌తో వ్యాధిని నయం చేయవచ్చని మానసిక వైద్యుడు రమణ అన్నారు.

Updated : 07 May 2024 19:33 IST

రామారెడ్డి: మానసిక రోగులకు చికిత్స, కౌన్సెలింగ్‌తో వ్యాధిని నయం చేయవచ్చని మానసిక వైద్యుడు రమణ అన్నారు. మంగళవారం రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య కార్యకర్తలకు, వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మానసిక ఆరోగ్యం సరిగా లేనివారు తమలో తాము మదనపడుతూ ఆత్మహత్య చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తులను ఆరోగ్య సిబ్బంది గుర్తించి అవగాహన కల్పించాలని, ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ 14416 నీ సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యుడు సురేష్, మానసిక ఆరోగ్య సామాజిక కార్యకర్త రాహుల్ కుమార్, వైద్య సిబ్బంది భీం, జానకి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు