logo

వేలికి సిరా.. తప్పిదాలకు తెర

మే 13న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో అక్రమాలను నిరోధించేందుకు, దొంగ ఓట్ల నమోదును తగ్గించేందుకు ఎన్నికల సంఘం సిరాను వినియోగిస్తుంది

Updated : 08 May 2024 06:49 IST

మే 13న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో అక్రమాలను నిరోధించేందుకు, దొంగ ఓట్ల నమోదును తగ్గించేందుకు ఎన్నికల సంఘం సిరాను వినియోగిస్తుంది. పోలింగ్‌ బూత్‌లో ఓటు వేయగానే ఓటర్ల ఎడమ చేతి చూపుడు వేలిపై సిరా రాస్తారు. చర్మంపై పూసిన ఈ సిరాను త్వరగా తొలగించడానికి సాధ్యపడదు. వేలుపై పూసిన సిరా కాంతికి గురై 15-30 సెకన్లలో పొడి బారుతుంది. చర్మాన్ని శుభ్రం చేసినప్పుడు కొద్దికొద్దిగా చెదిరిపోతుంది. కొంత కాలం వరకు వేలికి సిరా ఉంటుంది. ఎన్నికలకు వినియోగించే సిరా 10 శాతం, 14-18 శాతం సిల్వర్‌ నైట్రేట్‌ ద్రావణం మిలితమై ఉటుంది. సిరాలోని సిల్వర్‌ నైట్రేట్‌తో సూర్యరశ్మి తగలగానే చర్మంపై స్పష్టమైన గుర్తు ఏర్పడుతుంది.  కర్నాటక ప్రభుత్వరంగంలోని మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌, హైదరాబాద్‌లోని ఓ ప్రయోగశాలలో ఈ సిరాను తయారు చేస్తున్నారు. భారత ఎన్నికల సంఘం వద్ద ఈ సిరా ఉత్పత్తికి 1962లోనే ఆయా సంస్థలు హక్కులు పొందాయి. 1976 నుంచి మరో 28 దేశాలకు ఈ సంస్థ సిరాను సరఫరా చేస్తుంది. ఒకరు ఓటు వేశాకా తిరిగి పోలింగ్‌ బూత్‌ వచ్చే పరిస్థితి ఏర్పడదు. ఒకవేళ ఓటు వేయడానికి వచ్చినా అక్కడి సిబ్బంది అతని వేలిని చూసి ఓటు వేయడానికి నిరాకరిస్తారు.

-న్యూస్‌టుడే,కామారెడ్డి పట్టణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు