logo

భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం

ప్రమాదంలో భారత రాజ్యాంగం అనే కరపత్రాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రతినిధులు విడుదల చేశారు.

Published : 09 May 2024 17:47 IST

కామారెడ్డి పట్టణం: ప్రమాదంలో భారత రాజ్యాంగం అనే కరపత్రాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రతినిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ సంఘం అధ్యక్షుడు మల్లన్న, జిల్లా అధ్యక్షుడు కొత్తల గంగారాం, భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్, పీడీయస్‌యూ జిల్లా అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తును నిర్ణయించేవి పార్లమెంటు ఎన్నికలు అని అన్నారు.  దేశ స్వతంత్రం తర్వాత మన దేశ అభివృద్ధికి బహుజన (బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ) వర్గాల సంక్షేమానికి సామాజిక న్యాయానికి అండగా ఉన్నది కేవలం మన గొప్ప రాజ్యాంగం మాత్రమేనన్నారు. దేశం, రాజ్యాంగాన్ని రక్షించుకుందామని వివరించారు. నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని