logo

నినాదం.. చైతన్యం

లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలో 100 శాతం పోలింగ్‌ నమోదయ్యేలా అధికారులు అనేక రకాలుగా ప్రచారం చేస్తున్నారు.

Published : 10 May 2024 02:42 IST

లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలో 100 శాతం పోలింగ్‌ నమోదయ్యేలా అధికారులు అనేక రకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఓటు హక్కు కలిగి ఉన్నవారందరూ హక్కు వినియోగించేలా చైతన్యం చేస్తున్నారు. ఇందులో భాగంగా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లాలో పలు చోట్ల బ్యానర్లు కట్టి అవగాహన కల్పిస్తున్నారు. ‘నా ఓటే - నా భవిష్యత్తు, మన ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయించే దిక్సూచి, 100 శాతం ఓటింగ్‌లో పాల్గొందాం.. ప్రజాస్వామ్య శక్తిని చాటుదాం’ అంటూ నినాదాలు ముద్రించి నగరంలో అనేక చోట్ల బ్యానర్లు ఏర్పాటుచేశారు.

ఈనాడు, నిజామాబాద్‌


భవితకు బాటలు వేద్దాం..

తాతయ్య.. తరతరాల నుంచి అభివృద్ధి చేసిందెవరో చూసి ఓటు వెయ్యు
నానమ్మ.. నాటినుంచి నేటి వరకు ఎవరు ఏం చేశారో చూసి ఓటు వెయ్యు
అమ్మమ్మ.. ఆగం కావొద్దని ఆలోచించుకో..
నాన్న.. నాయకుడెలాంటి వాడో అర్థం చేసుకో..
అమ్మ.. పనులు ఎలా చేస్తున్నారో చూసుకో
అక్క.. ఐదేండ్ల అభివృద్ధిని అడిగి మరీ ఓటు వెయ్యు
అన్న.. అన్నింటికి నీవే సాక్ష్యంగా మారు..
చెల్లి.. చెప్పేమాటల్లో నిజమెంత.. అబద్ధమెంతో చూసుకో
తమ్ముడూ.. తర్వాత జరిగే పరిస్థితులను తెలుసుకో..
కొడుకా.. కోరుకున్న నాయకున్ని గెలిపించుకో..
కోడలా.. కోటి ఆశలతో ఓటు దీపం వెలిగించుకో
బిడ్డా.. బీదాబిక్కిని కాపాడే నాయకునికే ఓటు వెయ్యు.. భవిష్యత్తుకు మంచి బాట వెయ్యు

కొత్తపల్లి భూమేశ్‌, మనోహరాబాద్‌, జక్రాన్‌పల్లి మండలం, నిజామాబాద్‌- న్యూస్‌టుడే, సుభాష్‌నగర్‌


ఏళ్ల తరబడి ఎన్నికలకే!

ఈ చిత్రం కోటగిరి మండలం ఎత్తొండక్యాంపులోని మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాల భవనం. ఇది కేవలం ఎన్నికల సమయంలోనే తెరుచుకుంటుంది. గతంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఈ బడిలో బోధన చేసేవారు. క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరగడంతో అదే గ్రామంలో వేరే చోట విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు నిర్మించారు. అక్కడే తరగతులు జరుగుతున్నాయి. బడిని మాత్రం వివిధ ఎన్నికలకు పోలింగ్‌ కేంద్రంగా వినియోగిస్తున్నారు. మిగతా రోజుల్లో మూసే ఉంటుంది. ఈ నెల 13వ తేదీన జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఈ పోలింగ్‌ కేంద్రానికి 33 నంబరు కేటాయించారు.

న్యూస్‌టుడే, కోటగిరి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు