logo

ప్రతి గౌడ కుటుంబానికి ఐదెకరాలు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడి ప్రతి గౌడ కుటుంబానికి ఐదెకరాల భూమి ఇప్పించేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి జీనవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు.

Published : 10 May 2024 02:47 IST

ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న జీవన్‌రెడ్డి, వేదికపై నాయకులు

నిజామాబాద్‌ నగరం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడి ప్రతి గౌడ కుటుంబానికి ఐదెకరాల భూమి ఇప్పించేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి జీనవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని లక్ష్మి కల్యాణ మండపంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన గౌడల ఆత్మీయ సమ్మేళనంలో వీరు పాల్గొని మాట్లాడారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు వీలవుతుందన్నారు. కేంద్రంలో రాహుల్‌ గాంధీ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ది చెందుతుందన్నారు. నాయకులు డాక్టర్‌ కవితారెడ్డి, నగేష్‌రెడ్డి, ఈరవత్రి అనిల్‌, వేణు, గడుగు గంగాధర్‌ తదితరులు ఉన్నారు.

‘కేంద్రం వివక్ష’

ఇందూర్‌ సిటీ, న్యూస్‌టుడే : నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌ అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌ను గురువారం ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌తో కలిసి పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. గత పాలనలో నిజామాబాద్‌ స్టేషన్‌ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. డబ్లింగ్‌ పనులు చేస్తే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని వెల్లడించారు. తనను గెలిపిస్తే నిజామాబాద్‌ రైల్వే కూడలిని అభివృద్ధి చేయడంతో పాటు ఆర్మూర్‌ - ఆదిలాబాద్‌, బోధన్‌ - బీదర్‌ రైల్వే లైన్లు ఏర్పాటు చేయిస్తానని పేర్కొన్నారు. వెంట కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు కేశ వేణు తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని