logo

అలరిస్తున్న వసంతోత్సవాలు

గుణుపురం పట్టణంలో వంశధార వసంతోత్సవాలు సోమవారం సందడిగా జరిగాయి. ఒడిస్సీ, శాస్త్రీయ సంగీతం, భక్తి పాటల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Published : 01 Feb 2023 03:43 IST

భారీగా హాజరవుతున్న ప్రజలు

కటక్‌ కళాకారిణుల నృత్యం

గుణుపురం, నూస్‌టుడే: గుణుపురం పట్టణంలో వంశధార వసంతోత్సవాలు సోమవారం సందడిగా జరిగాయి. ఒడిస్సీ, శాస్త్రీయ సంగీతం, భక్తి పాటల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు వచ్చి ప్రదర్శనలు ఇచ్చారు. కటక్‌, పూరీలకు చెందిన పలువురు ఒడిస్సీ, భరతనాట్య ప్రదర్శనలిచ్చారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు రఘనాథ్‌పాత్ర్‌ బృందం శాస్త్రీయ సంగీత కచేరీ నిర్వహించారు. చివర్లో స్థానిక కళాకారులు ప్రదర్శనలు అలరించాయి. గుణుపురం ప్రాంతానికి చెందిన గాయని చిరజాని సబర పాడిన పాటలకు ముగ్ధులై రఘుపాత్ర్‌ ఆమెను సత్కరించారు. అంతకు మందు పూరీ నుంచి వచ్చిన పండితులు వేద మంత్రాల పఠనం, హారతి కార్యక్రమం చేపట్టారు. మంత్రి నబకిశోర్‌ దాస్‌ మృతికి సంతాపం తెలిపి రెండు నిమిషాలు మౌనం పాటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని