logo

పార్టీ మమ్మల్ని నిర్లక్ష్యం చేసింది

దీర్ఘకాలంగా వివిధ పదవుల్లో పార్టీకి సేవలందించామని, అధిష్ఠానం తమను పట్టించుకోలేదని, టికెట్ల కేటాయింపునకు నిర్వహించిన సమావేశాల్లోనూ తమను నిర్లక్ష్యం చేశారని బ్రహ్మపుర మాజీ ఎమ్మెల్యే శిబశంకర సహాని

Published : 16 Apr 2024 03:56 IST

విలేకరుల సమావేశంలో రాజీనామా పత్రాలు చూపుతున్న బిజద నాయకులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: దీర్ఘకాలంగా వివిధ పదవుల్లో పార్టీకి సేవలందించామని, అధిష్ఠానం తమను పట్టించుకోలేదని, టికెట్ల కేటాయింపునకు నిర్వహించిన సమావేశాల్లోనూ తమను నిర్లక్ష్యం చేశారని బ్రహ్మపుర మాజీ ఎమ్మెల్యే శిబశంకర సహాని, హింజిలికాటు మాజీ ఎమ్మ్లెల్యే హరిహర సాహు, బీఈఎంసీ మాజీ కార్పొరేటరు జమ్ముల సుష్మారాణి, మాజీ కౌన్సిలరు జమ్ముల శంకరనారాయణలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం పాతబస్టాండులోని ఓ హోటల్‌లో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్టీకి తమ సేవలు అవసరం లేదని భావించామని, అందుకే బిజద ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించి రాజీనామా పత్రాలను ప్రదర్శించారు.

19వ తేదీన కొరాపుట్‌ ఎంపి నామినేషన్‌ దాఖలు: సిమిలిగుడ, న్యూస్‌టుడే: కొరాపుట్‌ సిట్టింగ్‌ ఎంపీ సప్తగిరి ఉల్కా ఈ నెల 19వ తేదీన తన నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం రాత్రి నేతలు, కార్యకర్తలకు వెల్లడించారు. సిమిలిగుడలో పొట్టంగి కాంగ్రెస్‌ అభ్యర్థి రామ్‌చంద్ర కడమ్‌ నివాస గృహంలో కాంగ్రెస్‌ పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ముమ్మర ప్రచారంలో దేబ్‌ ఖరగ్‌పూర్‌, న్యూస్‌టుడే: ఘటాల్‌ లోక్‌సభ స్థాన తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి,  సిట్టింగ్‌ ఎంí,ˆ ప్రము ఖ బెంగాలీ చలనచిత్ర నటుడు దీపక్‌ అధికారి (దేబ్‌) ఆనందపూర్లో ప్రచారం ప్రారంభించారు.

బిజదలో బందుగాం సమితి ఉపాధ్యక్షురాలు: సిమిలిగుడ, న్యూస్‌టుడే: కొరాపుట్‌ జిల్లా బందుగాం సమితి ఉపాధ్యక్షురాలు గీతాంజలి పీడికతో పాటు అనేక మంది కాంగ్రెస్‌ నేతలు కార్యకర్తలు బిజదలో చేరారు. భువనేశ్వర్‌లో శంఖ భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు గీతాంజలి, బిజద నేత జీ.వివేక కుమార్‌తో పాటు 100 మంది కాంగ్రెస్‌ నేతలు కార్యకర్తలు ఆ పార్టీని విడిచి బిజూ జనతాదళ్‌ పార్టీలో చేరారు. లక్ష్మీపూర్‌ ఎమ్మెల్యే ప్రభు జాని, కొరాపుట్‌ జిల్లా అధ్యక్షుడు జీను, కేసిసి బ్యాంక్‌ అధ్యక్షుడు ఈశ్వర్‌చంద్ర పాణిగ్రహి తదితరులు పాల్గొన్నారు.

వీడని ఉత్కంఠŸ: రాయగడ గ్రామీణం, న్యూస్‌టుడే; రాయగడ జిల్లాలో గల బసంకటక్‌, రాయగడ అసెంబ్లి నియోజకవర్గలకు సంబంధించి భాజపా అభ్యర్ధుల జాబిత ఇంత వరకు వెలువడక పోవడంతో టికెట్‌ కోసం ఎదురు చూస్తున్న ఆశావహుల్లో రోజురోజుకు ఉత్కంఠం పెరుగుతుంది. రాయగడ నియోజకవర్గానికి సంబంధించి పార్టీ సీనియర్‌ నాయకుడు గత ఎన్నికలో పోటీ చేసి ఓటమి చెందిన బసంత ఉలకతో పాటు మాజీ ఎమ్మేల్యే బిభీషణ మాఝి టికెట్‌ కోసం ముమ్మర ప్రయత్నం చేస్తునట్లు తెలిసింది. బిసంకటక్‌ నియోజకవర్గానికి చెందినభాజపా జిల్లా మాజీ అధ్యక్షుడు గత ఎన్నికల్లో పోటీచేసి బిజద అభ్యర్థి మంత్రి జగన్నాథ సరక చేతిలో ఓటమి చెందిన శివశంకర ఉలకతో పాటు ఇటీవల బిజద పార్టీకి రాజీనామా చేసిన జిల్లా ఎస్‌డీసీ మాజీ చైర్మన్‌ జగన్నాథ నుండ్రుక కూడ ఎదరుచూస్తున్నారు.


జావ తాగుతున్న భాజపా నేతలు

జావ తాగిన నేతలు: నవరంగపూర్‌, న్యూస్‌టుడే: రానున్న ఎన్నికల్లో ఓట్లు తమకు వేయాలని మండుటెండలో నేతలు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. భాజపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు బలభద్ర మాజి, గౌరీశంకర్‌ మాఝి సోమవారం సదరు సమితి చటహండి పంచాయతీ తెంతులిగూడలో ప్రచారం చేశారు. వేసవి తాపానికి నీరసించిన తమ నేతలకు గ్రామస్థులు జావ ఇవ్వగా, నాయకులు ఆదివాసీల శైలిలో కూర్చొని తాగటం అందరి దృష్టిని ఆకర్షించింది.


గుణుపురం సమితిలో కాంగ్రెసు ప్రచారాలు ప్రారంభం

కాంగ్రెసు అభ్యర్థి ప్రచారాలు: గుణుపురం, న్యూస్‌టుడే: గుణుపురం కాంగ్రెసు అభ్యర్థిగా సత్యజిత్‌ గమాంగ్‌ పేరును ప్రకటించడంతో ఆయన ప్రచారం ప్రారంభించారు. ఇంత వరకు నామినేషన్లు వేయక పోవడంతో జెండాలు బ్యానర్లు ఏ పార్టీ ప్రవేశ పెట్టలేదు. గ్రామాల్లో పర్యటించి రచ్చబండ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని