logo

నేడు నాలుగో విడతకు నోటిఫికేషన్‌

రాష్ట్రంలో నాలుగు విడతల్లో పోలింగ్‌ జరగనుంది. తుది విడతగా జూన్‌ 1న మయూర్‌భంజ్‌, జాజ్‌పూర్‌, జగత్సింగ్‌పూర్‌, భద్రక్‌, బాలేశ్వర్‌, కేంద్రపడ లోక్‌సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తారు.

Published : 07 May 2024 00:42 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో నాలుగు విడతల్లో పోలింగ్‌ జరగనుంది. తుది విడతగా జూన్‌ 1న మయూర్‌భంజ్‌, జాజ్‌పూర్‌, జగత్సింగ్‌పూర్‌, భద్రక్‌, బాలేశ్వర్‌, కేంద్రపడ లోక్‌సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. దీంతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమై ఈ నెల 14 వరకు కొనసాగుతుంది. 15న నామినేషన్ల పరిశీలన, 17న ఉపసంహరణకు తుది గడువు.

మూడో విడత సమాప్తం: మూడోవిడత పోలింగ్‌ ఈ నెల 25న సంబల్‌పూర్‌, పూరీ, భువనేశ్వర్‌, కేంఝర్‌, కటక్‌, ఢెంకనాల్‌ లోక్‌సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఆయాచోట్ల సోమవారం నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని