logo

విగ్రహాల తొలగింపుపై ఆందోళన

మండలంలోని ఉల్లిభద్ర సమీప కొండపై క్రైస్తవ మత చిహ్నాలు, బొమ్మలను రెవెన్యూ శాఖ తొలగించడంపై సీపీఎం ఆధ్వర్యంలో క్రైస్తవ సోదరులు శనివారం నిరసన తెలిపారు.

Published : 27 Nov 2022 05:23 IST

ధ్వంసమైన ఏసు విగ్రహం వద్ద క్రైస్తవ సోదరుల నిరసన

గరుగుబిల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని ఉల్లిభద్ర సమీప కొండపై క్రైస్తవ మత చిహ్నాలు, బొమ్మలను రెవెన్యూ శాఖ తొలగించడంపై సీపీఎం ఆధ్వర్యంలో క్రైస్తవ సోదరులు శనివారం నిరసన తెలిపారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విగ్రహాలను పునరుద్ధరించాలని మత గురువులు ఎన్‌.ప్రసాదరావు, ఎస్సీ సెల్‌ మండలాధ్యక్షుడు బి.ప్రసాదరావు, సదానందం కోరారు. సీపీఎం నాయకుడు బి.వి.రమణ ఆధ్వర్యంలో తహసీల్దారుకు వినతిపత్రం అందించారు. ఘటనపై ఉప తహసీల్దారు కుమార్‌ మాట్లాడుతూ.. గొట్టివలస రెవెన్యూ సర్వే నంబరు 279లో ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సహకారంతో కలిసి తొలగించామన్నారు. సామాజిక అడవుల పెంపకం కోసం అటవీ శాఖకు అప్పగించిన భూమిని అనుమతులు లేకుండా ఆక్రమించడం చట్ట విరుద్ధమన్నారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని