logo

బ్యాంకు నూతన శాఖలకు ప్రతిపాదనలు

జిల్లాలో నూతనంగా ఆరు బ్యాంకు శాఖల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ పేర్కొన్నారు. జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో దీనిపై చర్చించామన్నారు.

Published : 24 Mar 2023 02:28 IST

పార్వతీపురం, న్యూస్‌టుడే: జిల్లాలో నూతనంగా ఆరు బ్యాంకు శాఖల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ పేర్కొన్నారు. జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో దీనిపై చర్చించామన్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీకి పంపించామన్నారు. జియ్యమ్మవలస మండలం బొమ్మిక, భామిని మండలం గురండిలో ఎస్‌బీఐ, కొమరాడ మండలం గంగరేగువలస, పాచిపెంట మండలం మాతుమూరులో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కురుపాం మండలం మొండెంఖల్లు, పాచిపెంట మండలం పి.కోనవలసలో యూబీఐ శాఖల ఏర్పాటుకు ప్రతిపాదించామన్నారు. ఎస్‌బీఐ అధికారులు సర్వే చేసి జియ్యమ్మవలస మండల కేంద్రం, బత్తిలిలో అనువుగా ఉన్నట్లు చెప్పారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని