logo

కుల వివక్ష కేసుల్లో సత్వర న్యాయం

అంటరానితనం, కుల   వివక్ష వంటి సాంఘిక దురాచారాలను అదుపు చేయడానికి యంత్రాంగం కృషి చేయాలని కలెక్టరు నిశాంత్‌కుమార్‌ సూచించారు.

Published : 02 Apr 2023 05:57 IST

మాట్లాడుతున్న కలెక్టరు నిశాంత్‌కుమార్‌, చిత్రంలో ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, జేసీ ఆనంద్‌, సబ్‌ కలెక్టరు నూరుల్‌కమర్‌

పార్వతీపురం, న్యూస్‌టుడే: అంటరానితనం, కుల   వివక్ష వంటి సాంఘిక దురాచారాలను అదుపు చేయడానికి యంత్రాంగం కృషి చేయాలని కలెక్టరు నిశాంత్‌కుమార్‌ సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా విజిలెన్సు, మానటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, జేసీ ఆనంద్‌, సబ్‌ కలెక్టరు నూరుల్‌కమర్‌, డీఆర్వో వెంకటరావు తదితరులతో చర్చించారు. అంటరానితనం, కుల వివక్ష ఘటనలు ఎక్కడ చోటుచేసుకున్నా వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. దాడులు, అత్యాచారాలకు గురైతే సత్వర న్యాయం చేసి ప్రభుత్వ పరంగా పరిహారం చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన 10 కేసుల స్థితిగతులపై సమీక్షించారు. డివిజన్‌ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని