logo

దీర్ఘకాలిక కేసులపై దృష్టి

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తు వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ ఆదేశించారు.

Published : 02 Jun 2023 02:45 IST

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తు వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. 2017 నుంచి ఉన్న కేసుల వివరాలపై ఆరా తీశారు. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంలో భాగంగా వస్తున్న ఫిర్యాదులపై అప్రమత్తంగా ఉండాలన్నారు.  రోడ్డు ప్రమాదాల నివారణ, బాలికలు, మహిళల అదృశ్యం కేసులపై చర్చించారు. కోర్టు కానిస్టేబుళ్లతో మాట్లాడి ఎల్‌పీసీ కేసుల గురించి ఆరా తీశారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. అదనపు ఎస్పీ దిలీప్‌ కిరణ్‌ (అడ్మిన్‌), ఏఎస్పీ సునీల్‌షరోన్‌, ఎస్టీపీవో కృష్ణారావు, దిశ డీఎస్పీ ఎస్‌ఆర్‌ హర్షిత, ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ మురళీధర్‌, ఏఆర్‌ డీఎస్పీ నాగేశ్వరరావు, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, డీసీఆర్‌బీ సీఐ ఎన్‌వీ ప్రభాకరరావు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని