logo

Parvathipuram: ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్‌ సతీమణి ప్రసవం

ఆయన జిల్లా పాలనాధికారి. అయినా సాధారణ ప్రజల్లా ప్రభుత్వ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని భావించారు.

Updated : 09 Nov 2023 09:13 IST

నిశాంత్‌కుమార్‌కు శుభాకాంక్షలు చెబుతున్న వైద్యులు

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: ఆయన జిల్లా పాలనాధికారి. అయినా సాధారణ ప్రజల్లా ప్రభుత్వ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని భావించారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న తన భార్యను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు మన్యం జిల్లా కలెక్టరు నిశాంత్‌కుమార్‌. పార్వతీపురంలోని జిల్లా ఆసుపత్రిలో అతని సతీమణి బుధవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. సూపరింటెండెంటు వాగ్దేవి, స్త్రీ వైద్య నిపుణులు పరీక్షలు చేసి పర్యవేక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రుల సేవలపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగేందుకు ఆయన ఆలోచన దోహదపడుతుందని సూపరింటెండెంటు పేర్కొన్నారు. గతంలో జేసీగా పనిచేసిన జె.ఆనంద్‌ సతీమణికి ఇక్కడే ప్రసవం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని