logo

Crime News: అడవి పందిగా భావించి..నాటు తుపాకీతో కాల్చి?

ఎస్‌.కోట మండలంలోని కొత్త అడ్డతీగ గ్రామంలో గిరిజనుడి హత్య కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. నాటు తుపాకీతో కాల్పులే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం గ్రామానికి చెందిన పాంగి అర్జున్‌ (35) తుప్పల్లో పుట్టగొడుగులు ఏరుతుండగా అడవి పందిగా భావించి వేటగాళ్లు కాల్చినట్లు సమాచారం.

Updated : 11 Nov 2023 09:00 IST

గిరిజనుడి హత్య కేసులో కొత్తకోణం

అర్జున్‌ (పాతచిత్రం)

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: ఎస్‌.కోట మండలంలోని కొత్త అడ్డతీగ గ్రామంలో గిరిజనుడి హత్య కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. నాటు తుపాకీతో కాల్పులే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం గ్రామానికి చెందిన పాంగి అర్జున్‌ (35) తుప్పల్లో పుట్టగొడుగులు ఏరుతుండగా అడవి పందిగా భావించి వేటగాళ్లు కాల్చినట్లు సమాచారం. పొట్టభాగంలో గుండు తగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో చనిపోయినట్లు భావించి భయంతో పారిపోయారు. కొన ఊపిరితో ఉన్న బాధితుడు నెమ్మదిగా పాకుతూ కొంత దూరం వచ్చి పడిపోయాడు. ఆ దారిన వెళ్లేవారు గమనించి సమాచారం అందించగా ఇతన్ని 108 అంబులెన్సులో తరలించేలోగా మృతి చెందాడు. ఈ ప్రాంతంలో కొత్త అడ్డతీగ, కరకవాని జోరు, దెప్పూరు గ్రామాలకు చెందిన కొందరు నాటు తుపాకులతో అడవి పందులు, కుందేళ్లు, కొండ మేకలు తదితరాలను వేటాడుతుంటారు. అయితే పగటిపూట జంతువును చూడకుండా ఎలా కాల్చారన్న దానిపై చర్చ సాగుతోంది. ఈ కేసులో పోలీసులు ఏమీ చెప్పడం లేదు. శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు. ఇప్పటి వరకు 12 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు, రెండు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. విజయనగరం డీఎస్పీ ఆర్‌.గోవిందరావు, ఇన్‌ఛార్జి సీఐ చంద్రశేఖర్‌ ఎస్‌.కోటలో ఉండి కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు ఇక్కడికి చేరుకున్నారు. భార్య కాంతం తెలుగు సరిగా మాట్లాడలేకపోతోంది. ప్రస్తుతం ఈమె గర్భిణి. రెండేళ్ల కుమార్తె శ్రావణిని ఎత్తుకున్న ఆమెను చూసి, స్థానికులు కంటతడి పెట్టారు.

రోదిస్తున్న కుటుంబ సభ్యులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని