logo

24న అదితి నామినేషన్‌

తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఈనెల 24వ తేదీన నామపత్రం దాఖలు చేయనున్నారు.

Published : 16 Apr 2024 05:32 IST

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఈనెల 24వ తేదీన నామపత్రం దాఖలు చేయనున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు కోట కూడలి నుంచి ఊరేగింపుగా బయలుదేరి, మూడులాంతర్లు, గంటస్తంభం, కన్యకాపరమేశ్వరి ఆలయం మీదుగా పాత మహారాజా ఆసుపత్రి కూడలికి చేరుకుంటారు. 10.30 గంటలకు తహసీల్దారు కార్యాలయంలో నామినేషన్‌ వేస్తారని పార్టీ ముఖ్య నాయకులు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని