logo

కొండెక్కిన సౌర పథకం..ఇది వైకాపా సర్కారు విధ్వంసం!!

జగన్‌ అయిదేళ్ల పాలనలో ఏమున్నది గర్వకారణం.. ప్రజావేదిక, అమరావతి, అన్నక్యాంటీన్‌.. మెగా సోలార్‌ ప్రాజెక్టుల విధ్వంసమే సమస్తం అన్నట్లు సాగింది.

Published : 16 Apr 2024 05:34 IST

మెగా సోలార్‌ ప్రాజెక్టుపై నిర్లక్ష్యపు చీకట్లు

ఇదీ ద్వారపూడి కొండపై పథకం తీరు

గన్‌ అయిదేళ్ల పాలనలో ఏమున్నది గర్వకారణం.. ప్రజావేదిక, అమరావతి, అన్నక్యాంటీన్‌.. మెగా సోలార్‌ ప్రాజెక్టుల విధ్వంసమే సమస్తం అన్నట్లు సాగింది. పేదల సంక్షేమం, అభివృద్ధి అంటూ వేదికలన్నింటిపైనా తీయని మాటలు వల్లెవేసిన ముఖ్యమంత్రి.. చేతల్లో మాత్రం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. గత ప్రభుత్వం అమలు చేసిన, ప్రారంభించిన పథకాలపైనా ధ్వేషం, అక్కసు కక్కుతూ వాటి విధ్వంసానికి పూనుకున్నారు. ఇందుకు విజయనగరం సమీపంలో ద్వారపూడి కొండపై ఏర్పాటు చేసిన మెగా సౌర విద్యుత్తు పథకం తీరే నిదర్శనం. 4500 వేల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తే లక్ష్యంగా రూ.4.8 కోట్లతో ఆరేళ్ల కిందట ప్రారంభించిన ఈ పథకంపై తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం నిర్వహణపై నిర్లక్ష్యం చూపింది. దీంతో వీటి పరికరాలు పాడై ఏటా రూ.కోట్లలో ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోంది.  

న్యూస్‌టుడే,విజయనగరం పట్టణం

నిరుపయోగంగా పడిఉన్న ప్యానెల్‌బోర్డు, స్టాండు సామగ్రి

విద్యుత్తు స్టేషన్‌ దుస్థితిది, కొండపై పడేసిన సామగ్రి

ద్వారపూడి కొండపై చెట్ల మధ్య పాడైన ఇనుప స్టాండ్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని