logo

‘ఎమ్మెల్యే చర్యలు ఎన్నికలకు ప్రమాదం’

పార్వతీపురం నియోజకవర్గంలో అధికార వైకాపా యథేచ్ఛగా ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తోందని తెదేపా అభ్యర్థి విజయచంద్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.

Published : 16 Apr 2024 05:35 IST

విలేకరులతో మాట్లాడుతున్న విజయచంద్ర, చిత్రంలో తెదేపా నాయకులు

పార్వతీపురం, న్యూస్‌టుడే: పార్వతీపురం నియోజకవర్గంలో అధికార వైకాపా యథేచ్ఛగా ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తోందని తెదేపా అభ్యర్థి విజయచంద్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఆర్వో కె.హేమలతను కలిసి వినతిపత్రం అందజేశారు. వాలంటీర్లతో సమావేశాలను నిర్వహించి, ఎన్నికల్లో వారి సేవలను ఎమ్మెల్యే జోగారావు వినియోగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై  ఆదివారం పోలీసులు, రిటర్నింగ్‌ అధికారికి చెప్పినా చర్యలు తీసుకోలేదన్నారు. ఇలాంటి చర్యలు ఎన్నికల వ్యవస్థకు ప్రమాదకరమన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నిబంధనలను అతిక్రమించారని, వాటిని ఖండించడానికి వెళ్తే తమపై దాడి చేశారన్నారు. ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడటం దారుణమన్నారు. పార్వతీపురం చరిత్రలో ఇలాంటివి ఎన్నడూ జరగలేదని, ప్రశాంతంగా ఉండే నియోజకవర్గంలో అలజడులు సృష్టిస్తున్నారని విమర్శించారు.

అదనపు ఎస్పీకి వినతి..

తెదేపా అభ్యర్థి విజయచంద్ర, ఇతర నాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఏఎస్పీ సునీల్‌ షరోన్‌కు మాజీ ఎమ్మెల్సీ డి.జగదీశ్‌, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు వినతిపత్రం అందజేశారు. సోమవారం ఆయనను కార్యాలయంలో కలిసి పార్వతీపురంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని కోరారు. నాయకులు మోహన్‌రావు, కార్తీక్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని