logo

నేటికీ తగ్గని పింఛనుదారుల ఆందోళన

బలిజిపేటలో అతి పెద్ద బ్యాంకు శాఖగా పేరొందిన యూనియన్‌ బ్యాంకునకు పింఛనుదారుల తాకిడి ఇంకా తగ్గలేదు.

Published : 04 May 2024 17:16 IST

బలిజిపేట: బలిజిపేటలో అతి పెద్ద బ్యాంకు శాఖగా పేరొందిన యూనియన్‌ బ్యాంకునకు పింఛనుదారుల తాకిడి ఇంకా తగ్గలేదు. బ్యాంకు ఖాతాలు చెల్లుబాటు కాని వృద్ధులంతా తమ ఖాతాలను బతికించుకునేందుకు శుక్రవారం కూడా వరుస కట్టారు. వీరికి బ్యాంకుశాఖ అధికారులు అందుబాటులో మంచినీరు, గుడారాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ పింఛనుదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పలగర, చిలకలపల్లి, నారాయణపురం, వెంగాపురం, నూకలవాడ, తుమరాడ గ్రామాల బ్యాంకు కరస్పాండెంట్లు ఆధార్‌ నంబర్లతో బయోమెట్రిక్‌ వేయించుకుని వెనువెంటనే నగదు చెల్లింపులు చేపడుతున్నారు. వీరికి అవసరమైన నగదును బ్యాంకు అధికారులు అందిస్తూ ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని