logo

దీపం.. సూపర్‌ సిక్స్‌ ప్రచారం

సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు వినూత్న రీతిలో ఆలోచిస్తున్నారు. తెదేపా కూటమి తన మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలపై ఇప్పటికే ఇంటింటి ప్రచారం సాగించింది.

Published : 16 Apr 2024 04:07 IST

ఈనాడు, ఒంగోలు గ్రామీణం: సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు వినూత్న రీతిలో ఆలోచిస్తున్నారు. తెదేపా కూటమి తన మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలపై ఇప్పటికే ఇంటింటి ప్రచారం సాగించింది. వీటిలో ప్రతి ఇంటికీ ఏటా మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్ల హామీ ఒకటి. ఈ విషయమై మహిళలకు మరింత అవగాహన కల్పించేందుకు ఆకట్టుకునేలా ప్రచారపర్వానికి తెర లేపింది. ఒంగోలు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఆధ్వర్యంలో ఆటోపై మూడు సిలిండర్ల పెద్ద బొమ్మలు ఉంచి వినూత్నంగా ప్రచారం సాగిస్తున్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే అమలు చేయనున్నట్లు హామీ ఇస్తున్నారు. ఈ అంశం మహిళా ఓటర్లను ఆకట్టుకుంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని