logo

కంస మామా.. కంచం చూడుమా!

విద్యార్థులకు తాను మేనమామనంటూ గొప్పలు చెబుతారు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి. వారి కంచాల్లో వడ్డిస్తున్న కూడు మింగుడు పడకున్నా పట్టనట్లు మిన్నకుండిపోతారు.

Published : 16 Apr 2024 04:09 IST

విద్యార్థి వదిలిన భోజనం: ఒంగోలు రాంనగర్‌ ఉన్నత పాఠశాలలో తినలేక ఇలా...

విద్యార్థులకు తాను మేనమామనంటూ గొప్పలు చెబుతారు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి. వారి కంచాల్లో వడ్డిస్తున్న కూడు మింగుడు పడకున్నా పట్టనట్లు మిన్నకుండిపోతారు. కాలదోషం పడుతున్న చిక్కీలే పిల్లలకు దిక్కవుతున్నాయి. మురిగిన, గోళీలను తలపించే గుడ్లు చూసి రేపటి పౌరులు కళ్లు తేలేస్తున్నారు. పాఠశాలల్లో వండి వడ్డిస్తున్న రుచీపచీ లేని మధ్యాహ్న భోజనం తినలేక పారేస్తున్నారు. అదే సమయంలో కుకింగ్‌ ఏజెన్సీలు, సహాయకులకూ ప్రతినెలా బిల్లు, గౌరవ వేతనం వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. పథకాల పేర్లు మార్చడంలో ఉన్న శ్రద్ధ వాటిని మెరుగ్గా అమలు చేయడంలో చూపడం లేదంటూ పలువురు విద్యావేత్తలు విమర్శలు గుప్పిస్తున్నారు. ధరలు ఆకాశాన్నంటుతున్నా.. అందుకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంపు లేకపోయింది. మొత్తానికి జగనన్న గోరుముద్ద కాస్తా.. నిర్వాహకులకు గుదిబండగా.. విద్యార్థులకు మింగుడు పడని ముద్దగా పరిణమించింది.

 తినేందుకు రుచిగా లేకపోవడంతో చెత్తడబ్బాలోకి చేరిన భోజన పదార్థాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని