logo

తనిఖీల పేరుతో సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దు

ఓటర్లను ప్రలోభపెట్టేలా తరలించే డబ్బును కట్టడి చేయడంపై మరింత దృష్టి పెట్టాలని ఎన్నికల ప్రత్యేక సాధారణ పరిశీలకుడు శ్రీరామ్‌ మోహన్‌ మిశ్రా సూచించారు.

Published : 30 Apr 2024 03:30 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఓటర్లను ప్రలోభపెట్టేలా తరలించే డబ్బును కట్టడి చేయడంపై మరింత దృష్టి పెట్టాలని ఎన్నికల ప్రత్యేక సాధారణ పరిశీలకుడు శ్రీరామ్‌ మోహన్‌ మిశ్రా సూచించారు. జిల్లాకు వచ్చిన ఆయన ఒంగోలు ప్రకాశం భవన్‌లో జిల్లా అధికారులు, ఎన్నికల పరిశీలకులతో సోమవారం సమావేశం నిర్వహించారు. తనిఖీల పేరుతో సామాన్య జనానికి ఇబ్బంది కలిగించకూడదని స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. సమావేశంలో ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌, పరిశీలకులు అరవింద్‌కుమార్‌ చౌరాసియా, మయూర్‌ కె మెహతా, శ్రీ ఖజాన్‌సింగ్‌, పోలీసు పరిశీలకులు హసీబ్‌ ఉర్‌ రెహమాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని