logo

కబ్జా చెరలో చారిత్రక దుర్గం

చారిత్రక కనిగిరి దుర్గానికీ దొంగపట్టా సృష్టించి ఆక్రమించుకుంటున్నారని స్థానికులు వాపోతున్నారు. నాటి రాజసానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న కోటను, కొండరాళ్లను ధ్వంసం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

Published : 02 May 2024 02:08 IST

దొంగ పట్టా సృష్టించి తవ్వకాలు
కనిగిరి, న్యూస్‌టుడే

కొండరాళ్లను ధ్వంసం చేస్తున్న దృశ్యం

చారిత్రక కనిగిరి దుర్గానికీ దొంగపట్టా సృష్టించి ఆక్రమించుకుంటున్నారని స్థానికులు వాపోతున్నారు. నాటి రాజసానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న కోటను, కొండరాళ్లను ధ్వంసం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. సహజసిద్ధంగా ఏర్పడిన కొండ పైన శ్రీకృష్ణ దేవరాయలు, కాటమరాజుల ప్రతినిధులు పరిపాలన సాగించారు. అయితే దీనిపై కన్నేసిన కొందరు తమకు పట్టా ఇచ్చారంటూ సుమారు 6 ఎకరాల కొండ స్థలంలో రెండు రోజులుగా తవ్వకాలు చేపట్టారు. దీనిపై కొన్ని సంఘాల నాయకులు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. అయితే ఆయన ప్రభుత్వ స్థలం ఎవరూ ఆక్రమించుకోకూడదని ఆదేశాలిచ్చినా వారు పట్టించుకోవడం లేదు. వందలాది సంవత్సరాల నాటి దుర్గాన్ని చెరబట్టి తవ్వకాలు చేస్తున్నా పట్టించుకోకపోవడం బాధాకరమని స్థానిక బీసీ సంఘాల నాయకులు విజయరామరాజు, నరసింహ, కొండయ్య, నారాయణ, నరసయ్య తదితరులు ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే కొండపై ఉన్న విజయమార్తాండేశ్వర దేవస్థానం వద్ద కొంత భాగం తొలిచి గ్రానైట్‌ను తరలించేసి హాయిగా వ్యాపారం చేసుకుంటున్నారు. ఆక్రమణ దారులు, వారికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

అభ్యంతరం చెబుతున్న స్థానికులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని