logo

సార్వత్రిక రణం.. హోరెత్తుతున్న ప్రచారం

సార్వత్రిక ఎన్నికలకు మరో 11 రోజులే గడువుంది. దీంతో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వీరికితోడుగా ఆయా పార్టీల అధినేతలు జిల్లాకు వరుస కడుతున్నారు.

Published : 02 May 2024 02:25 IST

గిద్దలూరుకు జనసేనాని, కనిగిరికి జగన్‌
3, 4 తేదీల్లో పొదిలి, దర్శికి చంద్రబాబు
ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే

సార్వత్రిక ఎన్నికలకు మరో 11 రోజులే గడువుంది. దీంతో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వీరికితోడుగా ఆయా పార్టీల అధినేతలు జిల్లాకు వరుస కడుతున్నారు. దీంతో ఒక్కసారిగా ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పేరిట మంగళవారం ఒంగోలులో యువత, విద్యార్థులతో ముఖాముఖి సమావేశమయ్యారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుతోపాటు, ఒకే ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఆయా వర్గాల్లో భరోసా నింపారు. అదే రోజు మర్రిపూడి, సంతనూతలపాడులో తెదేపా హిందూపురం ఎమ్మెల్యే, సినీ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ బహిరంగ సభ, రోడ్డు షోలతో శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా టంగుటూరులో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. నగదు, మద్యం వంటి తాయిలాలు ఎర వేసినా అంచనాలో సగం మేర కూడా జనం జగన్‌ సభకు రాలేదు. దీంతో మరోసారి ఆయన జిల్లా పర్యటనపై దృష్టి పెట్టినట్లు సమాచారం.

జిల్లాకు వరుస కడుతున్న అధినేతలు...: అన్ని పార్టీల అధినేతలు తమ అభ్యర్థుల గెలుపుపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా జిల్లా పర్యటనకు వరుస కడుతున్నారు.

ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఈ నెల 3న జనసేనాని పవన్‌ కల్యాణ్‌ గిద్దలూరు వస్తున్నారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం హెలీకాప్టర్‌లో నెల్లూరు బయలుదేరి వెళ్తారు. అదే రోజు దర్శి, ఒంగోలులో కూడా ప్రచారంలో పాల్గొనేలా తొలుత షెడ్యూల్‌ ప్రకటించినప్పటికీ.. ఆ రెండు చోట్ల మరోసారి నిర్వహించేలా ప్రణాళిక చేశారు.

వైకాపా అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి కనిగిరిలో ఏర్పాటు చేయనున్న సభలో అదే రోజు పాల్గొననున్నారు.

3న మార్కాపురం నియోజకవర్గం పొదిలిలో, 4న దర్శిలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభల్లో తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని