logo

చట్టం ముసుగులో దోపిడీకి జగన్‌ కుట్ర

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఆస్తులు, భూములకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంతో పాటు జిల్లాలోని మార్కాపురం పశ్చిమ ప్రాంతంలో రైతులకు చెందిన భూములు, పట్టా భూములను పట్టపగలే ఆక్రమణ చేసుకోని కబ్జా చేస్తున్న, చేసిన ఉదంతాలు అనేకం ఉన్నాయి.

Published : 05 May 2024 02:32 IST

జగన్‌ మార్కు రాజకీయం
ఆవేదనలో రైతులు

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఆస్తులు, భూములకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంతో పాటు జిల్లాలోని మార్కాపురం పశ్చిమ ప్రాంతంలో రైతులకు చెందిన భూములు, పట్టా భూములను పట్టపగలే ఆక్రమణ చేసుకోని కబ్జా చేస్తున్న, చేసిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో రైతుల ఆస్తులను కొట్టేసేందుకు కొత్త చట్టానికి తెరలేపింది. రైతుల పట్టా దారు పాసుపుస్తకాలపై వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు- భూరక్ష పథకం అనే పట్టాదారు పుస్తకాలు జారీ చేసి దానిపైన సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి పుస్తకాలను జారీ చేశారు. ఈ ప్రక్రియను ఇప్పటికే మార్కాపురం పశ్చిమ ప్రాంతంలోని మండలానికి ఒక్క గ్రామాన్ని మోడల్‌గా తీసుకోని భూమిని మొత్తం రీ సర్వే చేసి జగనన్న భూరక్ష అనే పథకం పేరుతో జగన్‌ బొమ్మ ఉన్న హద్దురాళ్లను కూడా రైతుల పొలాల్లో ఏర్పాటు చేశారు. ఈ చట్టం ద్వారా రైతుల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది.

న్యూస్‌టుడే, మార్కాపురం. కంభం. బేస్తవారపేట, కొనకనమిట్ల 


పాసుపుస్తకాలపై జగన్‌ చిత్రం ఎందుకు ?

మా పట్టాదారు పాసుపుస్తకాలపై ముఖ్యమంత్రి జగన్‌ చిత్రం వేయడం ఎందుకు ?. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతోంది. ల్యాండ్‌ టైటిల్‌ యాక్టుతో ప్రజల ఇబ్బందులు తప్పవు. ప్రజల ఆస్తులను బ్యాంకులకు చూపించి అప్పులు తీసుకువస్తారమే. సంపద సృష్టించడం చేతకాక, ప్రజల ఆస్తులు తనఖా పెట్టేందుకు ఈ యాక్టు తీసుకువస్తున్నారు.   రైతు స్పందించకపోతే ఫిర్యాదు చేసిన వ్యక్తులపై ఆన్‌లైన్‌ కావడంతో పాటు పట్టా దారు పాసుపుస్తకాలు జారీ అవుతాయి.  

మద్దుకూరి కోటయ్య, మాజీ సర్పంచి, రావిపాడు


అప్రమత్తంగా లేకపోతే ఆస్తులు ఆవిరి

కుట్ర పూరితంగానే జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ చట్టాన్ని అమలు చేశారు. ఈ చట్టం ద్వారా రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. మనకు తెలియకుండానే మన భూమి మరొకరి పరం అవుతోందన్న విషయం ఈ చట్టాన్ని విపులంగా పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతోంది.  వారసత్వ ఆస్తులను సైతం అధికారులు తేల్చే పరిస్థితి దాపురించింది. ఈ చట్టం అమలు ద్వారా మన కష్టార్జితమో, పిత్రార్జితమో ఏదైనా సరే వివాదంలో పడే అవకాశం ఎంత మాత్రం లేకపోలేదు.

సందు రామకృష్ణ, రైతు, సోమవారపేట.


రక్షణ లేకుండా పోతుంది

వైకాపా ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో రైతుల భూములకు రక్షణ లేకుండా పోతుంది. ఇప్పటికే వైకాపా పాలనలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పట్టా, ప్రభుత్వ భుములను సైతం ఆక్రమణ చేసుకున్న ఉదందాలు అనేకం ఉన్నాయి. ప్రభుత్వం ఇటువంటి దొంగచాటు చట్టాలను అమలు చేయడం వల్ల అటువంటి వారికి మీరంత అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. రైతులకు తెలియకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా రైతుల భూములపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే దానికి కనీసం స్పందించలేదని పూర్వీకుల నుంచి ఉన్న భూమిని ఇతరులకు ఏవిధంగా బదలాయిస్తారు. ఈ యాక్ట్‌ దారుణంగా ఉంది. రైతులు ఆలోచించి ఈ ఎన్నికల్లో ఓట్లు వేయాలి.

గాలి వెంకటరామిరెడ్డి, కాంగ్రెస్‌ రైతు కిసాన్‌, నాయకుడు, మార్కాపురం


మా ఆస్తులను, భూములను లాగేసుకుంటావా

మా భుములకు రక్షణ ఏదీ? : వైకాపా ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్‌ టైటిల్‌ యాక్టు ప్రమాదకరమైంది. ప్రజల ఆస్తులు లాక్కునే ప్రయత్నం. ఇలాంటి చట్టాలను తీసుకుచ్చి ప్రజల ఆస్తులను తనఖా పెట్టి అప్పులు చేసేందుకు కుట్ర జరుగుతోంది. ఈ యాక్టును ఉప సంహరించుకోవాలి. గతంలో ఎప్పుడూ ఇలాంటి చట్టాలు తీసుకురాలేదు. పేదల ఆస్తులకు రక్షణ కరవవుతోంది. ఆపద వస్తే రైతులు తమ భూములను తనఖా పెట్టుకునే హక్కు కూడా లేకుండాపోయే అవకాశం ఉంది. వెంటనే రద్దు చేయాలి. 

నందిగం శేషగిరిరావు, కలగొట్ల


భూములకు రక్షణ లేదు  కోల్పోతామో ఏమో..!

ఆస్తి మాదే రికార్డుల్లో మా పేరే ఉంది మాకే భయం అనుకుంటే పొరపాటే రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. మీ పేరు స్థానంలో ఇతర పేరు వచ్చి చేరొచ్చున్నారు. హద్దు రాళ్లుపై, పాసుపుస్తం జగన్‌ బొమ్మకు ముద్రిస్తున్నారు. దీంతో బ్యాంకు వారు రుణం మంజూరు చేయాలంటే అధికారులు ఆలోచన చేసిన తక్కువ రుణం మంజూరు చేస్తున్నారు. అప్రమత్తంగా లేకపోతే భూములను కోల్పోయే అవకాశముంది.

సానికొమ్ము వెంకటేశ్వర్లరెడ్డి. రైతు సంఘం నాయకుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని