logo

అధికారానికి ఝలక్‌

అనుచిత విధానాలు, కఠిన వైఖరితో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికవర్గాలతో పాటు పోలీసులను గత అయిదేళ్లుగా వైకాపా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.

Updated : 06 May 2024 05:38 IST

ఓటుకు నోటిచ్చినా ఉద్యోగులు విముఖం
తేడా కొడుతోందంటూ వైకాపాలో భయం

ఒంగోలు, న్యూస్‌టుడే: అనుచిత విధానాలు, కఠిన వైఖరితో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికవర్గాలతో పాటు పోలీసులను గత అయిదేళ్లుగా వైకాపా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఇప్పుడు వారి ఓట్లు తమకు పడటం లేదంటూ ఆందోళన మొదలైంది. ఓటుకు రూ. అయిదు వేలు ఇచ్చినా, ముఖం ఎదుటే మీకు ఓటేయలేమంటూ ఉద్యోగులు తేల్చి చెబుతున్నారు. ఈ ఝలక్‌తో ఆ పార్టీ అభ్యర్థులు, నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

దోషులుగా నిలిపే ప్రయత్నాలు...

ఉద్యోగ, ఉపాద్యాయ వర్గాలను వైకాపా ప్రభుత్వం రాచిరంపాన పెట్టింది. హామీలు అమలు చేయాలంటూ ఆందోళనకు దిగిన వారిపై ఉక్కుపాదం మోపింది. ఉద్యోగ, ఉపాధ్యాయులను ప్రజల ముందు దోషులుగా నిలిపేందుకు ప్రయత్నించింది. జీతమో రామచంద్రా అని సాగిలపడేలా చేసింది.  అయిదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగుల పొడగిట్టనట్లు వ్యవహరించిన అధికార వైకాపా.. తీరా ఎన్నికల సమయాన ప్రసన్నం చేసుకునేందుకు నానాపాట్లు పడుతోంది. అనుకూల సంఘాలతో పోస్టల్‌ బ్యాలెట్ల కొనుగోలుకు బేరాలు సాగిస్తోంది. ఈ వ్యవహారాన్ని వైకాపా ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తరఫున ఆయన అనయాయులు నియోజకవర్గాల వారీగా పర్యవేక్షిస్తుండటం గమనార్హం. అయినప్పటికీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాల ఓట్లు తమకు ఏమేరకు పడతాయోననే ఆందోళన అధికార పార్టీలో మొదలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని