logo

సమష్టిగా పోరాటం చేయాలి

తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలకు సమష్టిగా పోరాటం చేయాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు కోరారు. స్థానిక లహరి సమావేశమందిరంలో గురువారం

Published : 10 May 2024 01:33 IST

పెద్దదోర్నాలలో మాట్లాడుతున్న కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు

తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలకు సమష్టిగా పోరాటం చేయాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు కోరారు. స్థానిక లహరి సమావేశమందిరంలో గురువారం మండల జనసేన అధ్యక్షుడు కేతి మురళి అధ్యక్షతన నియోజకవర్గ జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాక్షస పాలనను అంతమొందించే సమయం ఆసన్నమైందన్నారు. పెద్దబొమ్మలాపురానికి చెందిన 15 వైకాపా కుటుంబాలు జనసేనలో చేరాయి. వీరభద్రాపురానికి చెందిన  30 కుటుంబాలు, త్రిపురాంతకం మండలంలోని కొత్త అన్నసముద్రానికి చెందిన 10 కుటుంబాలు ఎరిక్షన్‌బాబు సమక్షంలో తెదేపా తీర్ధం పుచ్చుకున్నాయి.

పొదిలి ఐదో వార్డులో ప్రచారంలో పాల్గొన్న తెదేపా నాయకులు.

  • కంభంమండలంలోని తురిమెళ్ల పంచాయతీ మదారుపల్లికి చెందిన యాదవ సామాజిక వర్గం నాయకులు, కార్యకర్తలు తెదేపాలో చేరారు.
  • మార్కాపురం పట్టణంలోని 17నుంచి 32వ వార్డు వరకు కందుల నారాయణరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 18వ వార్డులో50కుటుంబాలు తెదేపాలో చేరారు.
  • నారాయణరెడ్డి సోదరి యేరువ లక్ష్మి  పొదిలిలోని 5, 6 వార్డుల్లో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు.
  • గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లె పంచాయతీలో తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు.
  • కొమరోలు మండలంలోని బాదినేనిపల్లె, సూరావారిపల్లె గ్రామాల్లో అశోక్‌ రెడ్డి తనయుడు దివ్యేష్‌ రెడ్డి ప్రచారం నిర్వహించారు.
  • బేస్తవారపేట పంచాయతీలోని సోమవారపేటలో తెదేపా నాయకులు, కంభం మండలం హజరత్‌గూడెంలో అశోక్‌రెడ్డి సోదరి గీత ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
  • పెద్దదోర్నాల, యర్రగొండపాలెం పట్టణం, త్రిపురాంతకం, కంభం, మార్కాపురం పట్టణం, గిద్దలూరు పట్టణం, కొమరోలు గ్రామీణం, బేస్తవారపేట.

మార్కాపురంలో పార్టీలో చేరిన వారితో తెదేపా అభ్యర్థి నారాయణరెడ్డి, ఇతర నాయకులు

గిద్దలూరు: కృష్ణంశెట్టిపల్లెలో ప్రసంగిస్తున్న తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని