logo

పెట్టెలో పోస్టల్‌ ఓటు

పొరుగు జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించుకునేలా ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ఒంగోలు కేంద్రీయ విద్యాలయంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సాగింది. ప్రక్రియ ముగియడంతో సదరు బ్యాలెట్‌ పెట్టెలను జిల్లాల వారీగా విభజిస్తున్నారు.

Published : 10 May 2024 01:43 IST

రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో పోస్టల్‌ బ్యాలెట్‌ విభజన ప్రక్రియ పరిశీలిస్తున్న జిల్లా సమన్వయకర్త విశ్వేశ్వరరావు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: పొరుగు జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించుకునేలా ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ఒంగోలు కేంద్రీయ విద్యాలయంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సాగింది. ప్రక్రియ ముగియడంతో సదరు బ్యాలెట్‌ పెట్టెలను జిల్లాల వారీగా విభజిస్తున్నారు. ఈ మేరకు ప్రకాశం భవన్‌లోని స్పందన సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గురువారం ఈ ప్రక్రియ చేపట్టారు. ఇతర జిల్లాలకు చెంది, ప్రకాశంలో విధులు నిర్వహిస్తున్న 2,870 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,497 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పెట్టెలను అమరావతిలోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి శుక్రవారం తరలించనున్నట్లు పోస్టల్‌ బ్యాలెట్‌ జిల్లా సమన్వయకర్త విశ్వేశ్వరరావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు