logo

వాలంటీర్ల రాజీనామా

ఎన్నికల్లో వాలంటీర్ల సేవలు వాడుకుని లబ్ధి పొందాలని చూసిన అధికార పార్టీకి ఎన్నికల కమిషన్‌ రూపంలో ఎదురుదెబ్బ తగలడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వారితో బలవంతపు రాజీనామాలు చేయిస్తుంది.

Published : 16 Apr 2024 04:55 IST

శ్రీకాకుళం నగరం, నరసన్నపేట గ్రామీణం, మెళియాపుట్టి, జి.సిగడాం, సారవకోట, ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్నికల్లో వాలంటీర్ల సేవలు వాడుకుని లబ్ధి పొందాలని చూసిన అధికార పార్టీకి ఎన్నికల కమిషన్‌ రూపంలో ఎదురుదెబ్బ తగలడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వారితో బలవంతపు రాజీనామాలు చేయిస్తుంది. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో 109 మంది వాలంటీర్లతో అధికారులకు రాజీనామా పత్రాలను వైకాపా నాయకులు ఇప్పించారు. నగరపాలక సంస్థ అధికారులు ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు కార్యాలయ వర్గాలు ధ్రువీకరించాయి.

  • మెళియాపుట్టి మండలంలో 55 మంది, జి.సిగడాం మండలంలో 11 మంది, సారవకోట మండలంలో 87 మంది, నరసన్నపేట మండలంలో 17 మంది, ఆమదాలవలస మండలం దూసి పంచాయతీలో 15 మంది వాలంటీర్లు రాజీనామాలు చేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని