logo

పిలిపించారు.. కష్టపెట్టారు..!

తమను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోరుతూ ఇటీవల జిల్లాలో కొందరు ఉపాధ్యాయ, ఉద్యోగులు కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వారిని సోమవారం శ్రీకాకుళం నగరంలోని డీఎంహెచ్‌వో కార్యాలయానికి పిలిపించారు.

Updated : 16 Apr 2024 07:18 IST

బీమెట్ల మార్గం ద్వారా మూడో అంతస్తుకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు, మేడ మీది నుంచి కిందికి దిగుతున్న గర్భిణి

న్యూస్‌టుడే, గుజరాతీపేట(శ్రీకాకుళం): తమను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోరుతూ ఇటీవల జిల్లాలో కొందరు ఉపాధ్యాయ, ఉద్యోగులు కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వారిని సోమవారం శ్రీకాకుళం నగరంలోని డీఎంహెచ్‌వో కార్యాలయానికి పిలిపించారు. మెడికల్‌ బోర్డు జారీ చేసిన ధ్రువపత్రాలను పరిశీలనకు హాజరైన వారికి కనీస మౌలిక సదుపాయాల కల్పించకపోవడంతో అంతా అష్టకష్టాలు పడ్డారు. సర్వజనాసుపత్రి నుంచి వచ్చిన వైద్యనిపుణులు వారికి కార్యాలయంలోని మూడో అంతస్తులో పరిశీలన చేయడంతో దివ్యాంగులు, పక్షవాత రోగులు, గర్భిణులు, బాలింతలు మెట్లమార్గంలో పైకి వెళ్లలేక అవస్థలు పడ్డారు. ఈ విషయాన్ని యూటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్లు పొందూరు అప్పారావు, ఉమాశంకర్‌, జిల్లా కోశాధికారి రవికుమార్‌.. డీఎంహెచ్‌వో బొడ్డేపల్లి మీనాక్షి దృష్టికి తీసుకువెళ్లారు. కింది అంతస్తులో పరిశీలన చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు స్పందించిన డీఎంహెచ్‌వో నేటి నుంచి కిందనే పరిశీలన జరిగేలా ఏర్పాటు చేస్తామని చెప్పారు. వైద్యుల నివేదిక ఆధారంగా వారికి విధుల కేటాయింపుపై కలెక్టర్‌ నిర్ణయం తీసుకోనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని