logo

వైకాపాకు ఎదురుదెబ్బ

ఎన్నికల వేళ జిల్లాలో తెదేపా బలోపేతమవుతుండగా వైకాపాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

Published : 16 Apr 2024 05:06 IST

చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన దువ్వాడ శ్రీకాంత్‌, ఆయన భార్య జయశ్రీ, వైకాపా టెక్కలి మండల మాజీ అధ్యక్షుడు బగాది హరి

ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం, పలాస, కాశీబుగ్గ, న్యూస్‌టుడే: ఎన్నికల వేళ జిల్లాలో తెదేపా బలోపేతమవుతుండగా వైకాపాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఏ సామాజికవర్గ అండ కోసం అధికార పార్టీ ఎత్తుగడ వేసిందో అదే సామాజికవర్గం నుంచి ప్రజాదరణ కలిగిన నేతలు తెదేపా తీర్థం పుచ్చుకోవడంతో వైకాపా నేతలు అంతర్మథనంలో పడ్డారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ సోదరుడు, పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘ కౌన్సిలర్‌, జంట పట్టణాలకు సంబంధించిన అధికార పార్టీలో కీలక నేత దువ్వాడ శ్రీకాంత్‌, మందస మాజీ ఎంపీపీ కొర్ల కన్నారావు తెదేపాలో చేరారు. దువ్వాడ శ్రీనివాస్‌ ప్రధాన అనుచరుడు, వైకాపా టెక్కలి మండల మాజీ అధ్యక్షుడు బగాది హరి, సంతబొమ్మాళి మండలం యామాలపేట సర్పంచి ప్రతినిధి సంజీవికుమార్‌ వైకాపాను వీడటం ఆ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బే. వీరందరూ చేరడంతో మరికొందరు వరుస కడతారనే భావన తెదేపా నేతల నుంచి వ్యక్తమైంది.  

అవమానాలు తట్టుకోలేక..!

‘కొంతకాలంగా వైకాపా కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వాములను చేయడం లేదు. జరుగుతున్న అవమానాలను తట్టుకోలేక పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాం’ అని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ సోదరుడు, పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘ కౌన్సిలర్‌, వైకాపా సీనియర్‌ నాయకుడు శ్రీకాంత్‌, ఆయన భార్య కాళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జయశ్రీ తెలిపారు.  కాశీబుగ్గలో సోమవారం వారు విలేకర్లతో  మాట్లాడారు. ‘మేం వైకాపా ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నాం. 2019 ఎన్నికల్లో దగ్గరుండి పార్టీ అభ్యర్థి గెలుపునకు పని చేశాం. అదే వ్యక్తి కొంతకాలంగా నన్ను  ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులకు గురి చేశారు. మరోవైపు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచారు. ఈ నేపథ్యంలో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. తెలుగుదేశంతో మంచి జరుగుతుందని భావిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని