logo

రాజకీయాలకు గుండ కుటుంబం స్వస్తి

తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ దంపతులు రాజకీయాలకు మంగళవారం స్వస్తి పలికారు.

Published : 17 Apr 2024 04:47 IST

గుజరాతీపేట (శ్రీకాకుళం), న్యూస్‌టుడే: తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ దంపతులు రాజకీయాలకు మంగళవారం స్వస్తి పలికారు. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా గొండు శంకర్‌ పేరు అధిష్ఠానం ప్రకటించిన నాటి నుంచి వారు అసంతృప్తిగా ఉన్నారు. మద్దతుదారులు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చినప్పటికీ తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నుంచి స్పష్టమైన సమాచారం వచ్చే వరకు వేచి చూశారు. ఎట్టకేలకు మంగళవారం పలాసలో పార్టీ అధినేత పిలుపు మేరకు గుండ దంపతులు ఆయనతో భేటీ అనంతరం క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకొంటున్నామని ప్రకటించారు. ఎమ్మెల్సీ, నగర మేయర్‌ ఎన్నికల్లో గుండ కుటుంబానికి పార్టీ టికెట్‌ ఇస్తామని గొండు శంకర్‌తో పనిచేయాలని అధినేత నచ్చజెప్పినా గుండ దంపతులు అంగీకరించలేదు. గొండు శంకర్‌కు కాకుండా ఎవరికి టికెట్‌ ఇచ్చినా పనిచేస్తామని లేదంటే రాజకీయాల నుంచి తప్పుకొంటామని అధినేత వద్ద చెప్పి బయటకు వచ్చేశారు. అనంతరం రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్లు ప్రకటించారు. ఇంతకాలం సహకరించిన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని