logo

మంచినీళ్లు ఇవ్వలేకపోయారు.. మళ్లీ ఓటు ఎలా అడుగుతారు.?

‘ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేశారు. మళ్లీ ఓట్లు అడగడానికి వచ్చారు’ అని ఉపాధి హామీ పథకం వేతనదారులు పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతిని నిలదీశారు.

Published : 17 Apr 2024 04:56 IST

పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతిని నిలదీసిన వేతనదారులు

న్యూస్‌టుడే, ఎల్‌ఎన్‌పేట: ‘ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేశారు. మళ్లీ ఓట్లు అడగడానికి వచ్చారు’ అని ఉపాధి హామీ పథకం వేతనదారులు పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతిని నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్‌ఎన్‌పేట మండలం పెద్దకొల్లివలస పంచాయతీ పరిధి ఊర చెరువులో మంగళవారం పనులు చేస్తున్న కూలీల వద్దకు ఎమ్మ్లెల్యే వెళ్లి వారితో మాట్లాడారు. జగన్‌ను సీఎం చేయడానికి మళ్లీ ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని ఆమె కోరారు. అదే సమయంలో స్కాట్‌పేట గ్రామానికి చెందిన కొందరు కూలీలు స్పందిస్తూ ‘ఐదేళ్లలో మా గ్రామానికి ఏం చేశారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. మళ్లీ వచ్చి ఏం అభివృద్ధి చేస్తారు’ అని వారు నిలదీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని