logo

శ్రీకాకుళాన్ని మోడల్‌ నగరంగా అభివృద్ధి చేస్తాం

శ్రీకాకుళాన్ని మోడల్‌ నగరంగా అభివృద్ధి చేస్తామని ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకరరావు, మున్సిపల్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ జయంతి పేర్కొన్నారు.

Published : 30 Apr 2024 05:31 IST

శ్రీకాకుళం నగరంలో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్న ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకరరావు, మున్సిపల్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ జయంతి

గœుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: శ్రీకాకుళాన్ని మోడల్‌ నగరంగా అభివృద్ధి చేస్తామని ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకరరావు, మున్సిపల్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ జయంతి పేర్కొన్నారు. నగరంలోని పాత బస్టాండ్‌ నుంచి ఏడు రోడ్ల కూడలి, గుజరాతీపేట మీదుగా 44వ డివిజన్‌ రెల్లివీధి వరకు నిర్వహించిన రోడ్‌షోలో వారు పాల్గొన్నారు. ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అయిదేళ్లుగా అభివృద్ధి లేదన్నారు. జిల్లా కేంద్రాన్ని వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోక పోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారిందని విమర్శించారు. నగర తెదేపా అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, 44వ డివిజన్‌ ఇన్‌ఛార్జి కవ్వాడి సుశీల, తెదేపా జిల్లా మీడియా కన్వీనర్‌ జామి భీమశంకరరావు, పలు డివిజన్ల ఇన్‌ఛార్జిలు, జనసేన, భాజపా నాయకులు పాల్గొన్నారు. సాయంత్రం అరసవల్లి నుంచి బలగ వరకు నిర్వహించిన రోడ్‌షో కు సైతం అపూర్వ స్పందన లభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని