logo

ఒకేసారి ఇద్దరు,ముగ్గురు ఓటు

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ శనివారం గందరగోళంగా సాగింది. నరసన్నపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో నాలుగు మండలాల ఉద్యోగుల కోసం పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఉదయం నుంచే ఉద్యోగుల తాకిడి పెరిగింది.

Published : 05 May 2024 04:43 IST

నరసన్నపేటలో గందరగోళం

శ్రీకాకుళం: పోలింగ్‌ కేంద్రంలో సిబ్బందికి సూచనలు చేస్తున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌

నరసన్నపేట, కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ శనివారం గందరగోళంగా సాగింది. నరసన్నపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో నాలుగు మండలాల ఉద్యోగుల కోసం పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఉదయం నుంచే ఉద్యోగుల తాకిడి పెరిగింది. పోలింగ్‌ బూత్‌ వద్దకు ఒక్కసారిగా వారు చేరుకోవడంతో గది కిక్కిరిసిపోయింది. ఈ నేపథ్యంలో ఓటు వేసేందుకు సైతం అనువైన పరిస్థితులు లేక పలువురు ఇబ్బంది పడ్డారు. పోలింగ్‌ బూత్‌ వద్ద ఇద్దరు, ముగ్గురు ఒకేసారి ఓటు వేయడం గమనార్హం. కేంద్రం వద్ద ప్రధాన రాజకీయ పార్టీల నాయకుల తాకిడి నెలకొంది. కొద్దిసేపటి తర్వాత అక్కడకు చేరుకున్న ఆర్వో రామ్మోహనరావు పరిస్థితిని చక్కదిద్దారు.

నరసన్నపేట జూనియర్‌ కళాశాల పోలింగ్‌ కేంద్రంలో గుంపుగా ఉద్యోగులు

శ్రీకాకుళంలో ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం ఐదు దాటిన తర్వాత సైతం కొనసాగింది. పోలింగ్‌ సిబ్బందికి సరైన అవగాహన లేక ఓటర్లు గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉన్నారు. 27, 35 రూమ్‌ నంబర్లలో ఉదయం నుంచి రాత్రి వరకు నత్తనడకనే పోలింగ్‌ సాగింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌, రిటర్నింగ్‌ అధికారి రంగయ్య, సహాయ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, జిల్లా పరిషత్తు డిప్యూటీ సీఈవో ఆర్‌.వెంకట్రామన్‌ పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేశారు. కూటమి శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌ పోలింగ్‌ సరళిని పరిశీలించారు.


స్వేచ్ఛగా ఓటు వేయలేకపోయాం
- పి.జ్యోతి, ఉపాధ్యాయిని

నరసన్నపేట పోలింగ్‌ కేంద్రంలో స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితులు లేవు. ముఖ్యంగా బ్యాలెట్‌ భర్తీ చేసేందుకు సైతం వీలులేని పరిస్థితి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని