logo

వైకాపా నుంచి తెదేపాలో చేరికలు

కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడలోని టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు కార్యాలయంలో సోమవారం ఆయన సమక్షంలో వైకాపా నుంచి పలువురు తెదేపాలో చేరారు.

Published : 07 May 2024 04:37 IST

కోటబొమ్మాళి, సారవకోట, న్యూస్‌టుడే: కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడలోని టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు కార్యాలయంలో సోమవారం ఆయన సమక్షంలో వైకాపా నుంచి పలువురు తెదేపాలో చేరారు. టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల నుంచి సుమారు రెండు వందల కుటుంబాలు తెదేపాలో చేరాయి. సంతబొమ్మాళి మండలం మేఘవరం పంచాయతీ వాసులు, బోరుభధ్ర పంచాయతీ గొదలాం గ్రామ ఉప సర్పంచి కూన భాస్కరరావు, మరికొందరితో పాటు నలభై కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలో చేరాయి. టెక్కలి మండలం అయోధ్యపురం నుంచి వార్డు సభ్యులు కంచరాన యోగి, బగాది శ్రీనివాసరావు, వాలంటీర్లు చిన్నారావు, బగాది ప్రదీప్‌, కంచరాన కవిత, సహకార డైరెక్టర్‌ అశోక్‌కుమార్‌ తదితరులతో పాటు నలభై కుటుంబాలు, ముఖలింగాపురానికి చెందిన వాలంటీరు జెన్ని కాంతారావుతో పాటు 25 కుటుంబాలు చేరాయి. కోటబొమ్మాళి మేజర్‌ పంచాయతీ ప్రకాష్‌నగర్‌ కాలనీకు చెందిన యాభై మంది యువకులు, కురుడు పంచాయతీ ఎరకయ్యపేటకు చెందిన సూర్యనారాయణ తదితరులతో పాటు 25 కుటుంబాలు తెదేపాలో చేరాయి.

సారవకోట  మండలంలోని పద్మాపురం గ్రామానికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు రావాడ చెంచయ్యతో పాటు కేలవలస ఉప సర్పంచి చింతు లక్ష్మణరావు పంచాయతీకి చెందిన 150 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతించారు.


త్రైత సిద్ధాంత భగవద్గీతపై ప్రచారం..

సారవకోట, న్యూస్‌టుడే: మండలంలోని వాండ్రాయి, చిన్నగుజ్జువాడ, బెజ్జి, మూగుపురం, కొమ్ముసరియాపల్లి తదితర గ్రామాల్లో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞానవేదిక సత్రాం కమిటీ అధ్యక్షుడు గుండ జనార్దనరావు ఆధ్వర్యంలో భగవద్గీత ప్రచార కార్యక్రమం సోమవారం జరిగింది. సభ్యులు లక్ష్మీకుమారి, తాతయ్య, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు