logo

అరసవల్లిలో ద్విశతావధానం

తెలుగు భాష, సాహిత్యం, అవధానం వంటి ప్రక్రియల పట్ల యువతకు ఆసక్తి కలిగించేందుకు అరసవల్లిలో ద్విశతావధానం నిర్వహించనున్నట్లు సుమిత్ర కళాసమితి అధ్యక్షుడు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు.

Published : 10 May 2024 06:09 IST

శ్రీకాకుళం సాంస్కృతికం,  న్యూస్‌టుడే: తెలుగు భాష, సాహిత్యం, అవధానం వంటి ప్రక్రియల పట్ల యువతకు ఆసక్తి కలిగించేందుకు అరసవల్లిలో ద్విశతావధానం నిర్వహించనున్నట్లు సుమిత్ర కళాసమితి అధ్యక్షుడు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు. సుమిత్ర కళాసమితి, అరసవల్లి సూర్యనారాయణ స్వామి సంయుక్త ఆధ్వర్యంలో అయిదు రోజుల పాటు సంస్కృతాంధ్ర భాషల్లో ద్విశతావధానం ఉంటుందని ఆయన తెలిపారు. భావితరాలకు అవధాన విద్యను అందించాలనే ఉద్దేశంతో జులై 10వ తేదీ నుంచి 14 వరకు ప్రసిద్ధ మహిళా శతావధాని బులుసు అపర్ణ ద్విశతావధానం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పేర్లను ముందుగానే నమోదు చేసుకోవాలని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు 99496 88625, 94410 72502 నంబర్లను సంప్రదించాలని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు