logo

Dhoni: ధోనీ బర్త్‌డే.. వినూత్నంగా జరుపుకొన్న అభిమాని

క్రికెట్‌ టీంఇండియా మాజీ క్రికెట్‌ క్రీడాకారుడు ధోని పుట్టిన రోజును ఓ అభిమాని వినూత్నంగా జరుపుకొన్నాడు. కడలూరు జిల్లా రామనత్తం అరంగూర్‌ గ్రామానికి చెందిన గోపీ కృష్ణన్‌ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.

Updated : 08 Jul 2022 07:56 IST

వైరల్‌ అయిన ఇంటిపై ధోని పెయింటింగ్‌ చిత్రం

ప్యారిస్‌, న్యూస్‌టుడే:  క్రికెట్‌ టీంఇండియా మాజీ క్రికెట్‌ క్రీడాకారుడు ధోని పుట్టిన రోజును ఓ అభిమాని వినూత్నంగా జరుపుకొన్నాడు. కడలూరు జిల్లా రామనత్తం అరంగూర్‌ గ్రామానికి చెందిన గోపీ కృష్ణన్‌ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను ఇండియా క్రికెట్‌ టీం మాజీ కెప్టెన్‌, ప్రస్తుతం చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ అభిమాని. గతంలో తన ఇంటిని చెన్నై సూపర్‌కింగ్స్‌ కలర్‌ పసుపు రంగు పెయింట్‌ వేయించి, ఓ చోట ధోని చిత్రాన్ని పెయింటింగ్‌ వేయించాడు. సామాజిక మాధ్యమాల్లో గమనించిన దోని తన ట్విట్టర్‌లో గోపీకి కృతజ్ఞతలు తెలిపారు. ధోని 41వ పుట్టిన రోజు సందర్భంగా మళ్లీ ప్రత్యేకతను చాటుకొన్నాడు. పసుపు రంగులో ఉన్న ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశాడు. వాహనం రిజిస్ట్రేషన్‌ సంబరు ధోనీ జెర్సీ 7 అంకెను తెలిపే విధంగా 777గా తీసుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని