logo

జీఐసీతో ఐఐటీఎం ఒప్పందం

మూత్ర సంబంధిత క్షయ వ్యాధిని కనుగొనేందుకు ‘జనరల్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ (జీఐసీ)తో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ -మద్రాస్‌ (ఐఐటీఎం) చేతులు కలిపింది.

Published : 23 Feb 2023 00:53 IST

ఒప్పంద పత్రాలతో ఆచార్య మహేష్‌ పంచగ్నుల, జీఐసీ జీఎం మాధులిక భాస్కర్‌ తదితరులు

వడపళని, న్యూస్‌టుడే: మూత్ర సంబంధిత క్షయ వ్యాధిని కనుగొనేందుకు ‘జనరల్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ (జీఐసీ)తో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ -మద్రాస్‌ (ఐఐటీఎం) చేతులు కలిపింది. జీఐసీ నుంచి సీఎస్సార్‌ నిధులతో జరుగుతున్న ప్రాజెక్టుతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖలతోపాటు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు లబ్ధి పొందనున్నాయి. ఐఐటీ అలూమ్ని కార్పొరేట్‌ రిలేషన్స్‌ డీన్‌ మహేష్‌ పంచగ్నుల, జీఐసీ డైరెక్టర్‌, జీఎం మాధులిక భాస్కర్‌ 10వ తేదీన ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. రూ. 250 కోట్ల సీఎస్సార్‌ నిధులతో 200 ప్రాజెజెక్టులు చేపట్టేందుకు 180 సంస్థలతో భాగస్వామ్యం ఏర్పరచుకున్నట్టు ఐఐటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. మహేష్‌ పంచగ్నుల మాట్లాడుతూ రెండేళ్లలో దేశంలో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు అనుమానితులకు ర్యాపిడ్‌, సెన్సిటివ్‌ స్క్రీనింగ్‌ పరీక్షల ద్వారా రోగ నిర్ధారణ చేసి, సకాలంలో చికిత్స అందిస్తే వ్యాధిని నియంత్రించే వీలుంటుందని బయోమెడికల్‌ ఇంజినీరింగు విభాగ ఆచార్యులు వీవీ రాఘవేంద్ర సాయి అన్నారు. సాంకేతికతతో కూడిన పరిశోధనల ద్వారా క్షయ లక్షణాలకు కళ్లెం వేసేందుకు ఐఐటీ వంటి విద్యా సంస్థలతో కలిసి పని చేయడం మంచి విషయమని మాధులిక భాస్కర్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని