logo

ఐఐటీఎంలో బీఎస్‌ కోర్సు ప్రారంభం

‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ -మద్రాస్‌’ (ఐఐటీఎం)లో బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (బీఎస్‌) నాలుగేళ్ల ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌ కోర్సును కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆన్‌లైన్‌లో సోమవారం ప్రారంభించారు.

Updated : 07 Mar 2023 05:44 IST

కోర్సు బుక్‌లెట్‌తో డైరెక్టర్‌ వి.కామకోటి తదితరులు

వడపళని, న్యూస్‌టుడే: ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ -మద్రాస్‌’ (ఐఐటీఎం)లో బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (బీఎస్‌) నాలుగేళ్ల ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌ కోర్సును కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆన్‌లైన్‌లో సోమవారం ప్రారంభించారు.  విద్యార్థులు ఫౌండేషనల్‌ లెవల్‌ సర్టిఫికెట్‌, డిప్లొమా లేదా బీఎస్‌ డిగ్రీని పొందవచ్చు. అంతర్జాతీయంగా ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులకు, డిజైన్లకు ఈ కోర్సు ఉపయోగకరంగా ఉండనుంది. గతంలో డాటా సైన్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌ కోర్సును ఆన్‌లైన్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే.  ఇందులో 17వేల మంది చదువుతున్నారు.  ఆ తర్వాత సోమవారం ప్రారంభించిన బీఎస్‌ రెండో ఆన్‌లైన్‌ కోర్సు అని పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి కె.సంజయ్‌కుమార్‌, ఐఐటీ మద్రాస్‌, బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ ఛైర్మన్‌, డాక్టర్‌ పవన్‌ కె.గోయెంక ఆన్‌లైన్‌లో పాల్గొనగా,  ఐఐట డైరెక్టరు వి.కామకోటి,  పారిశ్రామిక వేత్తలు, ఇతర బోధనా సిబ్బంది హాజరయ్యారు. అందరికీ ఐఐటీలో విద్య అందాలనే లక్ష్యంతో బీఎస్‌ ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌లో ఫీజుతోపాటు ఉపకార వేతనాలు ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ కేటగిరీలకు చెందిన, ఏడాదికి రూ. అయిదు లక్షలలోపు ఆదాయమున్న కుటుంబాల వారికి అందజేస్తారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడుతూ ఈ కోర్సును ప్రారంభించడం అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు.  ఎన్‌ఈపీ అమలు చేసేందుకు ఇదే సరైన సమయమని అన్నారు. ఈ కోర్సును పూర్తి చేసిన వారికి పలు ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా బీఎస్‌ ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌లో చేరొచ్చు. అభ్యర్థులు ప్లస్‌టూలో గణితం, ఫిజిక్స్‌ చదివి ఉండాలి. కోర్సు బోధన ఆన్‌లైన్‌లో ఉంటుందన్నారు. క్విజ్‌, ఇతర పరీక్షలు మాత్రం వ్యక్తిగతంగానే నిర్వహిస్తామని కామకోటి అన్నారు. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగు విభాగ ఆచార్యులు బాబి జార్జి తదితరులు కోర్సు గురించి వివరించారు. 2023లో  ప్లస్‌టూలో ఉన్న వారు, ఏదేని యూజీసీ నిబంధనల మేరకు వేరే కోర్సులు చేస్తున్న వారు, ఉద్యోగాల్లో ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు https:///study.iitm.ac.in/es/  వెబ్‌సైట్‌లో చూడవచ్చు. 

మాట్లాడుతున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని