logo

మళ్లీ అవకాశం ఇస్తారని నమ్ముతున్నా

మధ్య చెన్నై నియోజకవర్గ ప్రజలు మళ్లీ తనకు అవకాశం కల్పిస్తారని నమ్ముతున్నట్లు డీఎంకే అభ్యర్థి దయానిధి మారన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన నామపత్రాన్ని షెనాయ్‌నగర్‌లోని కార్పొరేషన్‌ ప్రాంతీయ డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయంలో సమర్పించారు.

Published : 28 Mar 2024 00:19 IST

దయానిధి మారన్‌

నామపత్రం సమర్పిస్తున్న దయానిధి మారన్‌

చెన్నై, న్యూస్‌టుడే: మధ్య చెన్నై నియోజకవర్గ ప్రజలు మళ్లీ తనకు అవకాశం కల్పిస్తారని నమ్ముతున్నట్లు డీఎంకే అభ్యర్థి దయానిధి మారన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన నామపత్రాన్ని షెనాయ్‌నగర్‌లోని కార్పొరేషన్‌ ప్రాంతీయ డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయంలో సమర్పించారు. వెంట మంత్రి పీకే శేఖర్‌బాబు, ఎమ్మెల్యేలు మోహన్‌, వెట్రియళగన్‌, పార్టీ మధ్య చెన్నై మధ్య జిల్లా కార్యదర్శి సిట్రరసు తదితరులు ఉన్నారు. అనంతరం విలేకర్లతో దయానిధిమారన్‌ మాట్లాడుతూ.. ఐదేళ్లలో ఉత్తమ రీతిలో సేవలు అందించామని చెప్పారు. మంత్రి శేఖర్‌బాబు మాట్లాడుతూ.. నోటాతో పోటీపడే భాజపా అభ్యర్థులు డీఎంకే అభ్యర్థుల పనితీరును విమర్శించడానికి అర్హులు కాదన్నారు. అభివృద్ధి పనులు చేపట్టడంతో డీఎంకేకు కనుచూపు మేర ప్రత్యర్థులు లేరని తెలిపారు. ప్రస్తుత ఎన్నికలు ఇండియా కూటమి తర్వాతి స్థానం ఎవరికనే విషయంలో జరుగుతున్నాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని