logo

సింగపూర్‌ నుంచి వచ్చి..

పుదుచ్చేరిలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ శుక్రవారం 7 గంటలకే ప్రారంభమైంది. పుదుచ్చేరి కిరుమాంబాక్కం పోలింగ్‌బూత్‌లో సింగపూర్‌ నుంచి వచ్చిన భారత పౌరహక్కు పొందిన యువ ఓటరు ఆర్ముగం పువియరసి(18)తన తల్లి ఆర్ముగం మాలతితో వచ్చి తొలిఓటు హక్కు వినియోగించుకున్నారు.

Published : 20 Apr 2024 00:38 IST

తల్లితోపాటు యువ ఓటరు ఆర్ముగం పువియరసి

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: పుదుచ్చేరిలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ శుక్రవారం 7 గంటలకే ప్రారంభమైంది. పుదుచ్చేరి కిరుమాంబాక్కం పోలింగ్‌బూత్‌లో సింగపూర్‌ నుంచి వచ్చిన భారత పౌరహక్కు పొందిన యువ ఓటరు ఆర్ముగం పువియరసి(18)తన తల్లి ఆర్ముగం మాలతితో వచ్చి తొలిఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందుకోసం ఆమె రూ.50 వేలు ఖర్చుపెట్టి గురువారం సింగపూర్‌ నుంచి విమానంలో చెన్నై వచ్చి అక్కడి నుంచి పుదుచ్చేరి చేరుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. తాను సింగపూర్‌లో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చదువుతున్నానని చెప్పారు. భారత్‌లో ఎన్నికలు ఆసక్తిగా చూస్తువచ్చానన్నారు. ఓటు వేయాలనే ఆశతో ఇంతదూరం వచ్చానని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని