logo

మత ఘర్షణలు సృష్టించేలా ప్రధాని ప్రచారం

మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్‌డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

Published : 25 Apr 2024 00:17 IST

చర్యలకు ఎస్‌డీపీఐ ఫిర్యాదు

విలేకరుల సమావేశంలో ఎస్‌డీపీఐ నేతలు

ప్యారిస్‌, న్యూస్‌టుడే: మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్‌డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు రషీద్‌ విలేకరులతో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న మోదీ మత ఘర్షణలు సృష్టించేలా మాట్లాడుతున్నారని తెలిపారు. 21న రాజస్థాన్‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దేశంలోని ఆస్తులన్నింట్లో ముస్లిలంకు వాటా ఇస్తారని వాఖ్యలు చేశారన్నారు. ఈ మాటలు తీవ్ర కలకలం సృష్టించాయని చెప్పారు. ఇలా మాట్లాడే మోదీపై తగిన చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల్లో ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. తగిన చర్యలు చేపట్టకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని