logo

ఐలాండ్‌ మైదానానికి బ్రాడ్వే బస్టాండ్‌

చెన్నై బ్రాడ్వే బస్టాండ్‌ను తాత్కాలికంగా ఐలాండ్‌ మైదానానికి మార్చనున్నట్లు చెన్నై కార్పొరేషన్‌ ప్రకటించింది. ఇది 2002కు ముందు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లే ముఖ్యమైన బస్టాండ్‌గా ఉండేది.

Published : 01 May 2024 01:19 IST

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: చెన్నై బ్రాడ్వే బస్టాండ్‌ను తాత్కాలికంగా ఐలాండ్‌ మైదానానికి మార్చనున్నట్లు చెన్నై కార్పొరేషన్‌ ప్రకటించింది. ఇది 2002కు ముందు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లే ముఖ్యమైన బస్టాండ్‌గా ఉండేది. ఆ తర్వాత కోయంబేడు బస్టాండ్‌ ఏర్పాటు చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. బ్రాడ్వే బస్టాండ్‌ను చెన్నై కార్పొరేషన్‌ బస్సులు నడిచే ప్రాంతంగా మార్చారు. అంతదూరంలో ఉన్న కోయంబేడుకు వెళ్లి బస్సులు ఎక్కలేమని ప్రజలు ఆందోళనలు చేశారు. ఆ తర్వాత కోయంబేడు ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్టాండ్‌గా, స్థానిక బస్టాండ్‌గాను ఏర్పాటుచేశారు. ‘మల్టీ మోడల్‌ ఇంటిగ్రేషన్‌’ ట్రాన్స్‌పోర్ట్‌ టెర్మినల్‌ నిర్మించేందుకు దానిని తరలించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇందుకోసం ఐలాండ్‌ మైదానంలో చెన్నై కార్పొరేషన్‌ ద్వారా రూ.5 కోట్లతో మౌలిక వసతులు కల్పించనున్నారు. కొద్దినెలల్లోనే తరలించనున్నారు. ఆ తర్వాత బ్రాడ్వే బస్టాండ్‌ కూల్చివేసి ట్రాన్స్‌పోర్ట్‌ టెర్మినల్‌ నిర్మాణం ప్రారంభమవుతుంది. అక్కడ తొమ్మిది అంతస్తులతో కూడిన వాణిజ్య ప్రాంగణంతో కూడిన బస్టాండ్‌ నిర్మించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని