logo

రాష్ట్రానికి భారీ వర్ష సూచన

రాష్ట్రంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఆదివారం వాతావరణ పరిశోధన కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో...

Published : 06 May 2024 01:26 IST

ప్యారిస్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఆదివారం వాతావరణ పరిశోధన కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో... తమిళనాడు ప్రాంతాల్లో నెలకొన్న ఉపరితల ఆవర్తనం, గాలి దిశలో మార్పుల కారణంగా సోమవారం రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల, పుదుచ్చేరి, కారైక్కల్‌లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. 7వ తేదీ రాష్ట్రంలో కొన్నిచోట్ల, పుదుచ్చేరి, కారైక్కల్‌లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో మోస్తరు వర్షం కురుస్తుందని, నీలగిరి, కోయంబత్తూరు, ఈరోడు, సేలం, ధర్మపురి, కృష్ణగిరి, తిరుప్పత్తూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీవర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 8న రాష్ట్రంలో కొన్ని చోట్ల, పుదుచ్చేరి, కారైక్కల్‌లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం, నీలగిరి, కోయంబత్తూరు, దిండుక్కల్‌, తేని, తెన్‌కాశి, విరుదునగర్‌, తిరునెల్వేలిలో ఒకటి రెండు చోట్ల భారీవర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది. 9న రాష్ట్రంలో కొన్ని చోట్ల, పుదుచ్చేరి, కారైక్కల్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని, సోమవారం ఉత్తర తమిళనాడు అంతర జిల్లాల్లో   ఒకటి రెండు చోట్ల వేడి గాలుల ప్రభావం ఉంటుందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని