logo

జయకుమార్‌ మృతిపై దర్యాప్తు ముమ్మరం

తిరునెల్వేలి కాంగ్రెస్‌ తూర్పు జిల్లా అధ్యక్షుడు జయకుమార్‌ ధనసింగ్‌ మృతి వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Published : 07 May 2024 00:05 IST

టీనగర్‌, న్యూస్‌టుడే: తిరునెల్వేలి కాంగ్రెస్‌ తూర్పు జిల్లా అధ్యక్షుడు జయకుమార్‌ ధనసింగ్‌ మృతి వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యకు గురయ్యారనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. ఆయన రాసిన ఓ లేఖలో తనకు ప్రాణహాని ఉందని.. నాంగునేరి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రూబి మనోహరన్‌, టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు కేవీ తంగబాలు, ఇడయన్‌కుడి పంచాయతీ అధ్యక్షుడు, గాల్డ్‌వెల్‌ పాఠశాల ట్రస్టీ జేకర్‌తోపాటు మరికొందరి పేర్లు రాశారు. వారితో నగదు లావాదేవీల్లో గొడవలున్నట్లు పేర్కొన్నారు. కొందరు తనను మోసం చేయడాన్ని నిలదీయగా హత్య చేస్తానంటూ బెదిరించినట్లు తెలిపారు. రూబి మనోహరన్‌, తంగబాలుకు పోలీసులు సమన్లు పంపారు. జేకర్‌ తనకు రూ.30 లక్షలు చెల్లించాల్సి ఉందని జయకుమార్‌ పేర్కొన్న మేరకు ఆయన వద్ద పోలీసులు వివరాలు సేకరించారు. పాళయంగోటైలోని కేంద్ర మాజీ మంత్రి ధనుష్కోటి ఆదిత్తన్‌ ఇంట్లోనూ తనిఖీ చేసినట్లు సమాచారం. ఘటనాస్థలిలో జయకుమార్‌ శరీరం విద్యుత్తు తీగలతో చుట్టి కనిపించింది. ఆయన పక్కనే కిరోసిన్‌ సీసా పడి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని