logo

గడువు తీరిన బీరు తాగి యువకుల అస్వస్థత

మైలాడుదురై జిల్లా సీర్గాళి సమీప తెన్నంగుడిలోని ఓ ప్రభుత్వ మద్యం దుకాణంలో ఇద్దరు యువకులు రెండు రోజుల క్రితం బీరును కొనుగోలు చేసి తాగారు. అది తాగిన కొద్ది సేపటికే వారు అస్వస్థతకు గురయ్యారు.

Published : 09 May 2024 00:43 IST

టాస్మాక్‌ సిబ్బంది సస్పెన్షన్‌

వేళచ్చేరి, న్యూస్‌టుడే: మైలాడుదురై జిల్లా సీర్గాళి సమీప తెన్నంగుడిలోని ఓ ప్రభుత్వ మద్యం దుకాణంలో ఇద్దరు యువకులు రెండు రోజుల క్రితం బీరును కొనుగోలు చేసి తాగారు. అది తాగిన కొద్ది సేపటికే వారు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అక్కడున్న వారు.. ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. బాధితులు మద్యం దుకాణంలో గడువు తీరిన బీర్‌ను కొనుగోలు చేసి తాగి అనారోగ్యానికి గురైనట్లు గుర్తించారు. ఈ విషయమై అధికారులు విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. ఆ మేరకు  నిర్లక్ష్యంగా వ్యవహరించిన మద్యం దుకాణం సేల్స్‌మేన్‌ శంకర్‌, సూపర్‌ వైజర్‌ వడివేల్‌తో సహా ముగ్గురిని సస్పెండు చేస్తూ బుధవారం అధికారులు ఉత్తర్వులు జారీచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని