logo

పీటీ మాస్టర్‌ పాట వీడియో విడుదల

సంగీత దర్శకుడు, నటగాయకుడు హిప్‌హాప్‌ ఆది నటిస్తున్న చిత్రం ‘పీటీ మాస్టర్‌’. వేల్స్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి కార్తిక్‌ వేణుగోపాలన్‌ దర్శకత్వం వహించగా హిప్‌హాప్‌ ఆది సంగీతం సమకూర్చారు.

Published : 09 May 2024 00:45 IST

పాట వీడియో పోస్టరు

చెన్నై, న్యూస్‌టుడే: సంగీత దర్శకుడు, నటగాయకుడు హిప్‌హాప్‌ ఆది నటిస్తున్న చిత్రం ‘పీటీ మాస్టర్‌’. వేల్స్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి కార్తిక్‌ వేణుగోపాలన్‌ దర్శకత్వం వహించగా హిప్‌హాప్‌ ఆది సంగీతం సమకూర్చారు. చిత్రంలో హిప్‌హాప్‌ ఆది పీటీ మాస్టర్‌ పాత్ర పోషించారు. కాశ్మిర, అనికా సురేంద్రన్‌, పాండియరాజన్‌, త్యాగరాజన్‌, మునిశ్‌కాంత్‌ తదితరులు ఇతర నటీనటులు. చిత్రంలోని ‘కుట్టి పిశాసే’ పాట వీడియోను చిత్రబృందం యూట్యూబ్‌లో విడుదల చేసింది.


చిన్నదురైను అభినందించిన పా.రంజిత్‌

చిన్నదురైకు పుస్తకాలు అందిస్తున్న పా.రంజిత్‌

చెన్నై, న్యూస్‌టుడే: తిరునెల్వేలి జిల్లా నాంగునేరికి చెందిన ప్లస్‌ టూ విద్యార్థి చిన్నదురై గత ఏడాది సహచర విద్యార్థులతో కులవివక్ష దాడికి గురయ్యాడు. సోమవారం విడుదలైన పరీక్షా ఫలితాల్లో 469 మార్కులు పొందాడు. మంగళవారం ఆ విద్యార్థిని ముఖ్యమంత్రి నగరానికి రప్పించి అభినందించారు. సినీ దర్శకుడు పా.రంజిత్‌ కూడా పిలిపించి అభినందించారు. పుస్తకాలు కానుకగా అందించారు. చిన్నదురై కళాశాల ఫీజులు, ఇతర సహాయాలను తన ‘నీలం పణ్బాట్టు మైయం’ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు.


డీఎన్‌ఏ ఫస్ట్‌లుక్‌ పోస్టరు విడుదల

చెన్నై, న్యూస్‌టుడే: నెల్సన్‌ వెంకటేశన్‌ దర్శకత్వంలో అధర్వ నటిస్తున్న చిత్రం ‘డీఎన్‌ఏ’. ఒలింపియా మూవీస్‌ పతాకంపై ఈ చిత్రం యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్నట్లు సమాచారం. చిత్రం టైటిల్‌ గత ఏడాది విడుదలైన నేపథ్యంలో ప్రస్తుతం ఫస్ట్‌లుక్‌ పోస్టరును మంగళవారం చిత్రబృందం విడుదల చేసింది. అధర్వ పుట్టినరోజు సందర్భంగా పోస్టరు విడుదల చేయడం గమనార్హం. ఆధర్వకు సినీరంగ ప్రముఖులు, చిత్ర నిర్మాణ సంస్థలు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టర్లు విడుదల చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని