logo

ఆర్థిక అసమానతలు పెరిగాయి: అన్బుమణి

డీఎంకే, అన్నాడీఎంకే పాలనలో ఆర్థిక అసమానతలు పెరిగాయని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్‌ తెలిపారు. బుధవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో..

Published : 09 May 2024 00:50 IST

సైదాపేట, న్యూస్‌టుడే: డీఎంకే, అన్నాడీఎంకే పాలనలో ఆర్థిక అసమానతలు పెరిగాయని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్‌ తెలిపారు. బుధవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో.. అందరికీ ప్రగతి అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన డీఎంకే, అన్నాడీఎంకేల 57 ఏళ్ల పాలనలో తమిళనాడు ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు ఎక్కువయ్యాయని అన్నారు. తలసరి ఆదాయంలో రాష్ట్ర సరాసరికి తక్కువగా ఉండే 24 జిల్లాల్లో 16 జిల్లాలు ఉత్తర, కావేరి సాగు జిల్లాలకు చెందినవి కావటం గమనార్హమని పేర్కొన్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రంగరాజన్‌, డైరెక్టర్‌ షణ్ముగం జరిపిన అధ్యయన నివేదిక ప్రకారం 13 జిల్లాల్లో మాత్రమే రాష్ట్ర సరాసరి కంటే తలసరి ఆదాయం ఎక్కువగా ఉందన్నారు. 19 జిల్లాల్లో తక్కువని తెలిపారు. వాటిలో పురోగతికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని