logo

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సిబ్బంది సమ్మె

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ క్యాబిన్‌ సిబ్బంది సమ్మె గురువారం రెండోరోజు కూడా కొనసాగింది. సింగపూర్‌, కోల్‌కతా, తిరువనంతపురం తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఎనిమిది విమానాలు రద్దయ్యాయి.

Published : 10 May 2024 01:06 IST

పలు విమానాలు రద్దు

వడపళని, న్యూస్‌టుడే: ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ క్యాబిన్‌ సిబ్బంది సమ్మె గురువారం రెండోరోజు కూడా కొనసాగింది. సింగపూర్‌, కోల్‌కతా, తిరువనంతపురం తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఎనిమిది విమానాలు రద్దయ్యాయి. పైలట్లు, ఇంజినీర్లు ఎవరూ విధులకు హాజరు కాలేదు. ముందుగా సమాచారం తెలియక విమానాశ్రయానికి వచ్చిన తర్వాత రద్దయినట్టు తెలియడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, టాటా గ్రూపునకు చెందిన 60 విమానాలు గురువారం రద్దు చేశారు. మంగళవారం రాత్రి ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సిబ్బంది 200 మంది మూకుమ్మడిగా సెలవులు పెట్టి యాజమాన్యం నిర్వహణ సరిగా లేదని డిమాండు చేస్తూ సమ్మె బాట పట్టారు. పైలట్లు, ఇంజినీర్ల కొరత కూడా తోడవటంతలో 90 పైచిలుకు విమానాలు రద్దు చేశారు.

గురువారం కోల్‌కతాలో బయలుదేరి మధ్యాహ్నం 12.30కు చెన్నైకి రావాల్సిన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, రాత్రి 7.30కు రావాల్సిన సర్వీసులు రద్దయ్యాయి. చెన్నై నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన నాలుగు, రావాల్సిన నాలుగింటిని కూడా రద్దు చేశారు. చెన్నై- తిరువనంతపురం, చెన్నై-సింగపూర్‌తో పాటు ఉదయం నడవాల్సిన చెన్నై- కోల్‌కతా యుటిలిటీ సర్వీసు కూడా రద్దయింది. బుధవారం సింగపూర్‌ నుంచి బయలుదేరి అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో చెన్నై రావాల్సిన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, తిరువనంతపురం నుంచి చెన్నై వచ్చే విమానం రద్దు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని